Begin typing your search above and press return to search.

ఆన్ సెట్స్ లోనే మ‌నోళ్ల ద‌సారా ధ‌మాకా!

సంక్రాంతి త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు అతిపెద్ద పండ‌గ `ద‌స‌రా`. వారం రోజుల ముందు నుంచే దేవీ న‌వ‌రాత్ర‌లు ప్రారంభ‌మ‌వుతాయి కాబ‌ట్టి!

By:  Tupaki Desk   |   11 Oct 2024 2:30 AM GMT
ఆన్ సెట్స్ లోనే మ‌నోళ్ల ద‌సారా ధ‌మాకా!
X

సంక్రాంతి త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు అతిపెద్ద పండ‌గ `ద‌స‌రా`. వారం రోజుల ముందు నుంచే దేవీ న‌వ‌రాత్ర‌లు ప్రారంభ‌మ‌వుతాయి కాబ‌ట్టి! అంతా కోలాహాలంగా ఉంటుంది. సెల‌బ్రిటీలు ఈ వేడుక‌ను ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ వేడుక ఎంతో స్పెష‌ల్ గాసెల‌బ్రేట్ చేస్తుంటారు. అయితే ఈ పండుగ‌కు మ‌న హీరోలు సెల‌వు తీసుకోవ‌డం మాత్రం చాలా త‌క్కువ‌.

సంక్రాంతి కి ప్ర‌క‌టించినంత‌గా ద‌స‌రాకి సెల‌వులు తీసుకోరు. ప్ర‌స్తుతం కొంత‌మంది హీరోలు ఇన్ డోర్ షూటింగ్లో ఉంటే? మ‌రికొంత మంది ఔట్ డోర్ షూటింగ్ లో ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్ `రాజాసాబ్` సెట్‌లో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా `విశ్వంభర` షూట్ లో బిజీగా ఉన్నారు.

ప్ర‌స్తుతం షూటింగ్ అన్నపూర్ణ 7 ఏక‌ర్స్ లో శరవేగంగా జరుగుతోంది. కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక రిస్తున్నారు. అలాగే యంగ్ హీరో సందీప్ కిష‌న్ కొత్త సినిమా సెట్‌ వర్క్‌లో బిజీగా ఉంది. మ‌రోవైపు కింగ్ నాగార్జున మాత్రం బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమా `కూలీ` షూటింగ్లో పాల్గొంటూ నే..ఇంకోవైపు శేఖర్‌ కమ్ముల `కుబేర` షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఇక విక్టరీ హీరో వెంకటేష్‌ కూడా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న హీరోగా అనిల్‌ రావిపూడి ఓ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక నేచుర‌ల్ స్టార్ నాని మాత్రం హిట్ -3 షూట్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. ఇంకా ఆ సినిమాషూటింగ్ వైజాగ్ లో జ‌రుగుతూనే ఉంది. అలాగే విజయ్ దేవరకొండ- గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం షూటింగ్ కేరళలో జరుగుతోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మట్కా` షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. యంగ్ హీరో నిఖిల్ `స్వయంభు` షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. అలాగే విశ్వక్‌సేన్ హీరోగా రామ్ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `లైలా` షూటింగ్ శంకరప్లలి ప‌రిస‌రాల్లో జరుగుతోంది. మాస్ రాజా ర‌వితేజ..న‌ట‌సింహ బాల‌కృష్ణ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ద‌స‌రా సెల‌వులు అనంత‌రం 14 నుంచి తిరిగి షూట్ లో పాల్గొంటారు.