బాలీవుడ్ గుండెల్లో టాలీవుడ్ హీరోల రైళ్లు!
బాలీవుడ్ చిత్రాల పబ్లిసిటీ ఎలా ఉంటుంది? అన్నది చెప్పాల్సిన పనిలేదు. అక్కడ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లు లాంటివి ఉండవు.
By: Tupaki Desk | 19 Nov 2024 11:30 PM GMTబాలీవుడ్ చిత్రాల పబ్లిసిటీ ఎలా ఉంటుంది? అన్నది చెప్పాల్సిన పనిలేదు. అక్కడ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లు లాంటివి ఉండవు. అభిమానుల సమక్షంలో వేడుకలు నిర్వహించరు. అభిమానులతో ఇంటరాక్షన్ కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా? అది ఎంతో పరిమితంగా ఉంటుంది. అదీ నేరుగా కాదు..సోషల్ మీడియా ప్లాంట్ ఫాంల ద్వారా హీరోలు ముందుకొస్తారు. రియాల్టీ షోలు...కాఫీ విత్ కరణ్ టాక్ షోలు...కపిల్ శర్మలు తమ సినిమాల పబ్లిసీటి కోసం వినియోగంచుకుంటారు.
తప్ప ప్రత్యేకంగా అభిమానుల్లోకి సినిమాని తీసుకెళ్లాలి? అనే అజెండా అక్కడ ఏస్టార్ హీరోలనూ కనిపించదు. అదీ సినిమా రిలీజ్ సమయంలోనే ఈ హంగామా కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా టాలీవుడ్..కోలీవుడ్ సినిమా ఉంటుంది.ఈ రెండు పరిశ్రమల నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే? హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సినిమా రిలీజ్ రెండు నెలలు ఉందనగానే పబ్లిసిటీని ఎలా చేయాలని ప్రత్యేకమైన ఓ స్ట్రాటజీ వేసుకుని జనాల్లోకి వెళ్తుంటారు.
లిరికల్ సింగిల్స్ నుంచి టీజర్, ట్రైలర్ వరకూ వచ్చే సరికి సినిమాని పీక్స్ తీసుకెళ్తారు. తుదిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రచారం ముగిస్తారు. సరిగ్గా ఇదే రకమైన స్ట్రాటీజీతో ఇప్పుడు తెలుగు నుంచి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాల ప్రచారం నార్త్ లో జరుగుతోంది. `బాహుబలి` నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత ఇది పీక్స్ కి చేరింది. ఇప్పుడైతే చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భారీ జన సమీకరణ చేసి మరీ ఈవెంట్లు చేస్తున్నారు తెలుగు హీరోలు.
రామ్ చరణ్, బన్నీ సినిమా ఈవెంట్లు నార్త్ లో ఎలా జరిగాయో తెలిసిందే. `పుష్ప-2 `ట్రైలర్ అయితే కనివినీ ఎరుగని రీతిలో పాట్నాలోభారీ అభిమానుల మధ్య జరిగింది. అంతకు ముందు `గేమ్ ఛేంజర్` టీజర్ ఈవెంట్ కూడా యూపీలో ఇలాగే జరిగింది. మరి ఈ రెండు ఈవెంట్లు ఇప్పుడు బాలీవుడ్ హీరోల గుండెల్లో ఒణుకు పుట్టిస్తున్నాయా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ప్రచారం విషయంలో బాలీవుడ్ హీరోలు పద్దతి మార్చకపోతే గనుక పెను ప్రమాదం తప్పదనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
సొంత భాషల హీరోల కంటే పరభాషల నటుల కోసం అక్కడ అభిమానులు బయటకు వస్తోన్న తీరు చూస్తుంటే విస్మయానికి గురవ్వాల్సి వస్తోంది. వాళ్లకి ఈ రకమైన అనుభవం కొత్తనా? లేక? హీరోలంటే మనసుల్లో ప్రేమతో ఇలా స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారా? అన్నది అప్పుడే చెప్పలేం గానీ..ఇదే గనుక కంటున్యూ అయితే బాలీవుడ్ హీరోలు చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్వరలోనే `పుష్ప-2` టీమ్ హుబ్లీలో మరో భారీ ఈవెంట్ చేయడానికి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే.