Begin typing your search above and press return to search.

హీరోలంతా భాగ్య‌న‌గ‌రంలో బిజీ బిజీగా!

సంక్రాంతి పండ‌గ కావ‌డంతో ఎక్క‌డి షూటింగ్ లు అక్క‌డ నిలిచిపోయాయి. యూనిట్ అంద‌రికీ సెల‌వులు ప్ర‌క‌టించ డంతో అంతా పండ‌గ ఉత్స‌వంలో మునిగిపోయారు.

By:  Tupaki Desk   |   17 Jan 2025 9:58 AM GMT
హీరోలంతా భాగ్య‌న‌గ‌రంలో బిజీ బిజీగా!
X

సంక్రాంతి పండ‌గ కావ‌డంతో ఎక్క‌డి షూటింగ్ లు అక్క‌డ నిలిచిపోయాయి. యూనిట్ అంద‌రికీ సెల‌వులు ప్ర‌క‌టించ డంతో అంతా పండ‌గ ఉత్స‌వంలో మునిగిపోయారు. దాదాపు వారం రోజులుగా అంతా పండ‌గ మూడ్ లోనే ఉన్నారు. అయితే ఇప్పుడా పండ‌గ ముగియ‌డంతో మ‌ళ్లీ య‌ధా విధిగా షూటింగ్ ల‌కు రెడీ అవుతున్నారు. ఈనెల 21 నుంచి ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `రాజాసాబ్` షూటింగ్ కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది.

ప్ర‌స్తుతం శంషాబాద్ స‌మీపంలో సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన సెట్లు వేస్తున్నారు. యూనిట్ అంతా సెట నిర్మాణం ప‌నుల్లోనే బిజీగా ఉంది. ఆప‌ని 21 లోపు పూర్తవుతుంది. ఈ నేప‌థ్యంలో మ‌రుస‌టి నుంచి అదే సెట్ లో షూటింగ్ నిర్వ‌హించ‌డానికి మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. దీంతో టాకీ పార్టు కూడా పూర్త‌వుతుంది. అనంత‌రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే చిత్రీకర‌ణ బాగా డిలే అవ్వ‌డంతో వీలైనంత వేగంగా పూర్తిచేయాల‌ని ప్ర‌భాస్ కూడా క‌మిట్ మెంట్ తో ప‌ని చేస్తున్నాడు.

అటు ప్ర‌భాస్ `పౌజీ` సెట్ కి కూడా హాజ‌రవుతోన్న సంగ‌తి తెలిసిందే. `రాజాసాబ్` పూర్త‌యిన వెంట‌నే సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ `స్పిరిట్` ని ప‌ట్టాలెక్కిస్తాడు. అలాగే యంగ్ హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా `తెలుసుక‌దా` అనే సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ శంక‌ర్ ప‌ల్లిలో జ‌రుగుతోంది. ప్ర‌ధాన తారాగ‌ణమంతా షూటింగ్ లో పాల్గొంటుంది. కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇక న‌ట‌సింహ బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌ తావ‌డం` మొద‌లైన సంగ‌తి తెలిసిందే.

పండ‌గ కావ‌డంతో గ్యాప్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీయాక్ష‌న్ సీక్వెన్స్ తో చిత్రీక‌ర‌ణ మొద‌ల వుతుంద‌ని స‌మాచారం. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` కూడా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. ప్ర‌స్తుతం శంషాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. బాలీవుడ్ న‌టుడు బాబి డియోల్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. మ‌రో 25 రోజులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 25 రోజుల షూట్ అనంత‌రం చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌వుతుంద‌ని స‌మాచారం.