Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా కంటే ముందే వాళ్లు ఇండియాని ఇలా ఊపాలి!

అయితే వెబ్ సిరీస్ ప్ర‌య‌త్న‌లు మాత్రం ముగ్గురు సీరియ‌స్ గా చేయ‌డం లేదు. సీరియ‌స్ గా చేస్తే ఎక్క‌డో ఓ చోట లాక్ అయ్యే అవ‌కాశం ఉంది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 5:30 PM GMT
పాన్ ఇండియా కంటే ముందే వాళ్లు ఇండియాని ఇలా ఊపాలి!
X

టాలీవుడ్ స్టార్ హీరోలెవ‌రు ఇంకా వెబ్ సిరీస్ లు వైపు చూడ‌టం లేదు. సీనియ‌ర్ హీరోల్లో విక్ట‌రీ వెంక‌టేష్ త‌ప్ప మిగిలిన వారంతా సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్య‌త వెబ్ సిరీస్ ల‌కు ఇవ్వ‌డం లేదు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున కూడా ఇప్ప‌టికే బుల్లి తెర షోల‌ను హోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ర‌కంగా అక్క‌డా మంచి ఫాలోయింగ్ ద‌క్కించుకున్నారు. కానీ అదే బుల్లి తెర‌ని షేక్ చేస్తోన్న వెబ్ సిరీస్ లు అంటే మాత్రం ఈ ముగ్గురు ముందుకు రావ‌డం లేదు.

అలాగని ఆస‌క్తి లేక? కాదు. వెంక‌టేష్ ఇప్పటికే 'రానా నాయుడు'తో లాంచ్ అయ్యాడు. ప్ర‌స్తుతం రెండ‌వ ఎపిసోడ్ తో రావ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి కూడా ఓసంద‌ర్భంలో వెబ్ సిరీస్ లు చేయాల‌ని ఉందనే ఆస‌క్తిని వ్య‌క్తం చేసారు. కింగ్ నాగార్జున కూడా ఇదే త‌ర‌హాలో మాట్లాడారు. బాల‌య్య కూడా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అన్ స్టాప‌బుల్ షోని బాల‌య్య ఏ రేంజ్ కి తీసుకెళ్లారో తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో స‌రైన వెబ్ సిరీస్ వ‌స్తే న‌టించడానికి ఆయ‌న సిద్దంగా ఉన్న‌ట్లు లీకులందుతున్నాయి. అయితే వెబ్ సిరీస్ ప్ర‌య‌త్న‌లు మాత్రం ముగ్గురు సీరియ‌స్ గా చేయ‌డం లేదు. సీరియ‌స్ గా చేస్తే ఎక్క‌డో ఓ చోట లాక్ అయ్యే అవ‌కాశం ఉంది. పైగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సీనియ‌ర్ల‌కు వెబ్ సిరీస్ లు అన్న‌ది చాలా కీల‌కం అని చెప్పాలి. ఈ ముగ్గురు పాన్ ఇండియా హీరోలు కాదు. వాళ్ల చిత్రాలేవైనా రీజ‌న‌ల్ గానే ప‌రిమితం.

త‌ర్వాత త‌రం న‌టులంతా స్టార్లుగా మారి పాన్ ఇండియాని షేక్ చేస్తున్నారు. వాళ్ల‌తో ఈ సీనియ‌ర్లు న‌లుగురు పోటీ ప‌డ‌టం అన్న‌ది అంత సుల‌భం కాదు. పోటీ ప‌డి పాన్ ఇండియాలో మార్కెట్ ద‌క్కించుకోవ‌డం అంత ఈజీ కాదు. ఒక సినిమా ఫెయిలైందంటే? పాజిటివిటీ కంటే నెగిటివ్ ఎక్కువ‌గా ఫోక‌స్ అవుతుంది. అదే వెబ్ సిరీస్ ద్వారా అంత నెగిటివిటీ రాదు. ఈ నేప‌థ్యంలో ఈ ముగ్గురు హీరోలు పాన్ ఇండియా సినిమాల కంటే ముందే వెబ్ సిరీస్ల‌తో ఫేమ‌స్ అయి త‌దుప‌రి పాన్ ఇండియా సినిమాలు చేస్తే బాగుంటుంద‌నే భావ‌న తెర‌పైకి వ‌స్తోంది.