Begin typing your search above and press return to search.

టాప్ 10: తెలుగులో అత్యధిక ప్రాఫిట్ అందించిన సినిమాలివే..

ముఖ్యంగా తెలుగు సినిమా అనేసరికి నార్త్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా ప్రేక్షకులకి ఒక పాజిటివ్ వైబ్ ఉంది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:35 AM GMT
టాప్ 10: తెలుగులో అత్యధిక ప్రాఫిట్ అందించిన సినిమాలివే..
X

బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా స్టాండర్డ్స్ గణనీయంగా పెరిగాయి. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలపై 200-300 కోట్ల బడ్జెట్ లు పెడుతున్నారు. పాన్ ఇండియా బ్రాండ్ తో ఎక్కువ భాషలలో సినిమాని రిలీజ్ చేయడం వలన స్టార్స్ చిత్రాలపై బిజినెస్ కూడా భారీగానే జరుగుతోంది. మూవీ బాగుంటే కలెక్షన్స్ కూడా అదే రీతిలో భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా అనేసరికి నార్త్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా ప్రేక్షకులకి ఒక పాజిటివ్ వైబ్ ఉంది.

ఇది మూవీ కలెక్షన్స్ లలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘దేవర’ కి మిక్స్డ్ రివ్యూలు వచ్చిన కూడా వరల్డ్ వైడ్ గా ఊహించని కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవరాల్ గా ఇప్పటి వరకు అత్యధిక ప్రాఫిట్ సొంతం చేసుకున్న తెలుగు సినిమాల జాబితా చూసుకుంటే అందులో ‘దేవర’ ఏడో స్థానంలో ఉంది. లాంగ్ రన్ లో ఈ ప్రాఫిట్ పరంగా ఈ మూవీ ఏ పొజిషన్ కి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అత్యధిక ప్రాఫిట్ అందుకున్న తెలుగు సినిమాలో ‘బాహుబలి 2’ మొదటి స్థానంలో ఉంది.

ఈ సినిమాపై 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. ఏకంగా 508 కోట్ల ప్రాఫిట్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంది. రెండో స్థానంలో ఉన్న ‘బాహుబలి 1’ మూవీకి 118 కోట్ల ప్రీ రిలీజ్ జరిగింది. 186 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది. ‘కల్కి 2898ఏడీ’ టాప్ 3లోకి వచ్చింది. ఈ మూవీ పైన 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 169.25 కోట్ల ప్రాఫిట్ ని సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పైన అత్యధికంగా 451 కోట్ల ప్రీ రిలీజ్ జరగగా, లాంగ్ రన్ లో 163.03 కోట్ల ప్రాఫిట్ తో టాప్ 4 చిత్రంగా నిలిచింది.

ఈ ఏడాది రిలీజ్ అయిన ‘హనుమాన్’ మూవీ కేవలం 29.65 కోట్ల వ్యాపారం వరల్డ్ వైడ్ గా జరిగింది. అయితే ఈ చిత్రం ఏకంగా 127.95 కోట్ల ప్రాఫిట్ ని అందుకొని టాప్ 5 ప్రాఫిటబుల్ మూవీగా నిలబడింది. టాప్ 6లో ఉన్న ‘అల వైకుంఠపురంలో’ మూవీ పైన 84.34 కోట్ల బిజినెస్ జరగగా 75.88 కోట్ల ప్రాఫిట్ ని సాధించింది. ఇక ‘దేవర’ మూవీ పైన ప్రపంచ వ్యాప్తంగా 182.25 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు ఈ మూవీ 57.96 కోట్ల ప్రాఫిట్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. తరువాత స్థానాలలో వరుసగా ‘గీతాగోవిందం’, ‘ఎఫ్2’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు నిలిచాయి.

అత్యధిక ప్రాఫిట్ అందించిన టాప్ 10 సినిమాలు

బాహుబలి 2 - 508Cr (352Cr)

బాహుబలి 1 - 186Cr (118Cr)

కల్కి 2898ఏడీ - 169.25Cr (370Cr)

ఆర్ఆర్ఆర్ - 163.03Cr (451Cr)

హనుమాన్ - 127.95Cr (29.65CR)

అల వైకుంఠపురములో - 75.88Cr (84.34Cr)

దేవర 1 - 57.96Cr (182.25Cr)***

గీతాగోవిందం - 55.43Cr (15Cr)

ఎఫ్ 2 - 50Cr (34.5Cr)

వాల్తేరు వీరయ్య - 48.85Cr (88Cr)