తెలుగు తెరపై చారీత్రాత్మక నేపథ్యం సరికొత్తగా!
భారతదేశ సినీ చరిత్రలో చారిత్రాత్మక నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ముఖ్యంగా ఇలాంటి చిత్రాలకు బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది.
By: Tupaki Desk | 13 Feb 2025 6:55 AM GMTభారతదేశ సినీ చరిత్రలో చారిత్రాత్మక నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ముఖ్యంగా ఇలాంటి చిత్రాలకు బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. వాస్తవ కథలతో పాటు..చరిత్రల్ని తవ్వితీయడం అన్నది బాలీవుడ్ కే చెల్లింది. అయితే అక్కడ అన్ని చరిత్రలు సక్సెస్ అయింది లేదు. ఆ కథని డ్రెమటైజ్ చేసే క్రమంలో దొర్లిన తప్పిదాలతో వందల కోట్లు రూపాయలు నష్టాల పాలు జరిగింది. ఇలాంటి ప్రయత్నాలు సౌత్ ఇండస్ట్రీలో పెద్దగా జరగవు.
చేసినా అలాంటి కథని కమర్శియలైజ్ చేయడంలో తెలుగు రైటర్లు తెలివిగా వ్యవహరిస్తుంటారు. తాజాగా పాన్ ఇండియాలో అలాంటి చిత్రాలు కొన్ని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. 2025లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నిఖిల్ హీరోగా `స్వయంభు` తెరకెక్కుతోంది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇది చోళుల కథ. సినిమా సెట్స్ కి వెళ్లి చాలా కాలమవుతుంది. ఇంకా సెట్స్ లో నే ఉంది.
చారీత్రాత్మక కథ కావడంతో సెట్స్ లోనూ టీమ్ సవాళ్లు ఎదుర్కుంటుంది. ఈ సినిమా కోసం నిఖిల్ కత్తి యుద్దం, గుర్రపుస్వారిపై ప్రత్యేక శిక్షణ తీసుకుని బరిలోకి దిగాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం `హరిహరవీరమల్లు`. ఈ సినిమా కథ మొఘల సామ్రాజ్యానికి సంబంధిం చింది. ఇందులో ఔరంగజేబు పాత్రలో బాబి డియోల్ నటిస్తున్నాడు.
మొఘల సామ్రజ్యంలో కొంత కథని మాత్రమే తీసుకుని దీన్ని రెండు భాగాలు తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో కనిపిస్తాడు. అలాగే యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తోన్న `మిరాయ్` కూడా చారిత్రాత్మక అంశాలున్న కథనే. బేస్ పాయింట్ మాత్రమే తీసుకుని తెరపై కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. అలాగే యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా ఇదే వరల్డ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఈసినిమాలన్నీ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇటీవలే తెనాలి రామకృష్ణ కథని నాగ చైతన్యతో తెరకెక్కిస్తానని చందు మొండేటి ప్రామిస్ చేసారు. ఇది చందు మార్క్ మూవీగా ఉండబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.