Begin typing your search above and press return to search.

జులై టూ సెప్టెంబర్.. టాలీవుడ్ రిపోర్ట్ ఇలా..

ప్రతి వారం థియేటర్లలో అనేక సినిమాలు రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ దక్కించుకుని దూసుకుపోతాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:30 PM GMT
జులై టూ సెప్టెంబర్.. టాలీవుడ్ రిపోర్ట్ ఇలా..
X

ప్రతి వారం థియేటర్లలో అనేక సినిమాలు రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ దక్కించుకుని దూసుకుపోతాయి. మరికొన్ని మెల్లగా ఆడియన్స్ ను అలరిస్తాయి. ఇంకొన్ని భారీ అంచనాల మధ్య విడుదలైనా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోతాయి. అలా టాలీవుడ్ 2024 థర్డ్ క్వార్టర్ (జులై, ఆగస్టు, సెప్టెంబర్)లో వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉందో ఓసారి గుర్తుచేసుకుందాం.

ఈసారి వేసవిలో ఐపీఎల్ తో పాటు ఎన్నికల వల్ల సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. జూన్ 27వ తేదీన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 మూవీ.. గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఆ మూవీ.. జులైలో తన థియేట్రికల్ రన్ ను సక్సెస్ ఫుల్ గా సాగించింది. భారీ వసూళ్లను అందుకుని అదరగొట్టింది. అదే నెలలో థియేటర్లలో 11 చిన్న మూవీలు రిలీజ్ అయ్యాయి.

రాజ్ తరుణ్ పురుషోత్తముడు, ప్రియదర్శి డార్లింగ్ సహా పలు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అన్నీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాయి. ఆ తర్వాత ఆగస్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజ్ అవ్వాల్సి ఉన్నా వాయిదా పడింది. అదే డేట్ కు రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు వచ్చి డిజాస్టర్ టాక్ అందుకున్నాయి. ఆగస్టులో వాటితోపాటు కమిటీ కుర్రోళ్లు, ఆయ్, మారుతీనగర్ సుబ్రమణ్యం, సరిపోదా శనివారం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

మెగా డాటర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు.. మంచి రెస్పాన్స్ అందుకుంది. యువతను థియేటర్లకు రప్పించింది. మరో చిన్న మూవీ ఆయ్ కూడా సాలిడ్ హిట్ గా నిలిచింది. రావు రమేష్ మారుతీ నగర్ సుబ్రమణ్యం.. థియేటర్లలో ఊహించినంత రెస్పాన్స్ దక్కించుకోకపోయినా.. విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం.. సినీ ప్రియులను అలరించింది హిట్ గా మారింది.

ఇక సెప్టెంబర్ లో 35-చిన్న కథ కాదు, ది గోట్, సత్యం సుందరం, దేవర చిత్రాలు విడుదలయ్యాయి. టాలీవుడ్ హల్క్ రానా సమర్పించిన

35-చిన్న కథ కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మంచి కలెక్షన్లను కూడా సాధించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ది గోట్ మూవీ నిరాశపరిచింది. కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మూవీ.. ఓ అందమైన జీవితం ప్రయాణంలా మెప్పిస్తూ అలరిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ వసూళ్లు సాధిస్తూ అదరగొడుతోంది. మరి ఫుల్ రన్ లో దేవర ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.