Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కి రాయ‌ల‌సీమ వెళ్లాల్సిందే!

ఇప్ప‌టికే స‌న్ని డియోల్ హీరోగా గోపీచంద్ మ‌లినేని త‌న‌దైన మాస్ యాక్ష‌న్ చిత్రం `జాట్` ని తెర‌కెక్కిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   17 March 2025 1:33 PM IST
బాలీవుడ్ కి రాయ‌ల‌సీమ వెళ్లాల్సిందే!
X

టాలీవుడ్ కంటెంట్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. హిందీ మార్కెట్ లో తెలుగు సినిమాలో భారీ వ‌సూళ్లు సాధిస్తున్నాయి. `పుష్ప‌-2 `దంగ‌ల్` వ‌సూళ్ల‌కు స‌మీపంలోకి వెళ్లిందంటే? తెలుగు కంటెంట్ కి అక్క‌డ ఆడియ‌న్స్ ఎంత ప్రాధాన్య‌త ఇస్తున్నారు అన్న‌ది అద్దం ప‌డుతుంది. దీంతో తెలుగు డైరెక్ట‌ర్ల‌తో ప‌నిచేయాడానికి బాలీవుడ్ హీరోలు ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు.

ఇప్ప‌టికే స‌న్ని డియోల్ హీరోగా గోపీచంద్ మ‌లినేని త‌న‌దైన మాస్ యాక్ష‌న్ చిత్రం `జాట్` ని తెర‌కెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుండ‌గా య‌శ్ రాజ్ ఫిలింస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సినిమా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని మంచి అంచ‌నాలున్నాయి. ఇలాంటి మాస్ కంటెంట్ బాలీవుడ్ కి కొత్త కావ డంతోనే ఈ రేంజ్ లో అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. అంత‌కు ముందు బ‌న్నీ న‌టించిన `స‌రైనోడు` యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచిందంటే? కార‌ణం అందులో మాస్ అప్పిరియ‌న్స్ ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది.

ఇవ‌న్నీ చూస్తుంటే బాలీవుడ్ కి టాలీవుడ్ నుంచి వెళ్లాల్సిన అస‌లైన కంటెంట్ మిగిలిపోయింద‌నిపిస్తుంది. అదే రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ క‌థ‌లు. సీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు తెలుగులో ఎంత పెద్ద విజ‌యం సాధించాయో తెలిసిందే. వాటిలో న‌ట‌సింహ బాల‌కృష్ణ అంటే అప్ప‌ట్లో బ్రాండ్. బాల‌య్య ని చూసే చిరంజీవి `ఇంద్ర` సినిమా కూడా చేసారు. `స‌మ‌ర‌సింహారెడ్డి`, `ఇంద్ర‌,` చెన్న కేశ‌వ‌రెడ్డి`, `న‌ర‌సింహనాయుడు`,` సీమ‌సింహం` లాంటి సినిమాలు హిందీ కి వెళ్లాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది.

ఇలాంటి సినిమాలు బాలీవుడ్ మేకర్స్ ఎవ‌రూ ఇంత వ‌ర‌కూ ట్రై చేయ‌లేదు. ఇవే సినిమాల్ని అక్క‌డ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల‌తో రీమేక్ చేస్తే బాక్సాఫీస్ వ‌సూళ్ల‌తో షేక్ అవ్వ‌డం ఖాయం. ఇలాంటి కంటెంట్ అక్క‌డ ఆడియ‌న్స్ కి కొత్త ఎక్స్ పీరియ‌న్స్ ని అందిస్తుంది.