Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్ డైరెక్టర్ చేస్తే రిజల్ట్ అలా.. హీరో చేస్తే ఇలా..?

ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పుడు కథ, కథనం మీద దర్శకుడికి ఎంత క్లారిటీ ఉంటుందో అందులో నటిస్తున్న హీరోకి కూడా అంతే క్లారిటీ ఉంటుంది ఉండాలి కూడా

By:  Tupaki Desk   |   30 Aug 2024 4:30 PM GMT
ప్రమోషన్స్ డైరెక్టర్ చేస్తే రిజల్ట్ అలా.. హీరో చేస్తే ఇలా..?
X

ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పుడు కథ, కథనం మీద దర్శకుడికి ఎంత క్లారిటీ ఉంటుందో అందులో నటిస్తున్న హీరోకి కూడా అంతే క్లారిటీ ఉంటుంది ఉండాలి కూడా. ఏదో డైరెక్తర్ చెప్పింది చేసి సినిమాతో సంబంధం లేదు అంటే ఆ సినిమా ఫలితాలు ఆ హీరోల కెరీర్ లు కూడా అలానే అంతంత మాత్రంగా ఉంటాయి. ఐతే కొంతమంది మాత్రం నటిస్తున్న సినిమాకు దర్శకుడు మిగతా చిత్ర యూనిట్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో దానికి రెట్టింపు ఎఫర్ట్ పడుతుంటారు. అలాంటి వారికి ఫలానా సినిమా అంటే ఆ హీరో అని వెంటనే గుర్తుకొస్తాడు. ఇక సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ విషయంలో కూడా అదే ఫార్ములా అప్లై చేస్తారు.

కొన్ని సినిమాలు హీరోలు బిజీ అవ్వడం వల్లో.. మరో కారణమో కానీ రిలీజ్ ముందు జస్ట్ ఒకటి రెండు ఇంటర్వ్యూస్ ఇచ్చి మమా అనిపించేస్తారు. హీరో ఎలాగు రావట్లేదు కదా అని డైరెక్టర్ కాస్త ఎగ్జైటింగ్ తో ప్రమోషన్స్ చేస్తుంటారు. ఐతే తన సినిమా మీద ఉన్న అతి నమ్మకం మీద డైరెక్టర్ సినిమాలో ఉన్న విషయాన్ని కాస్త ఎక్కువ చేసి చెబుతాడు. అది చూసిన ఆడియన్స్ సినిమా మీద భారీ అంచనాలతో వెళ్లి నిరుత్సాహ పడతారు. ఈమధ్య మిస్టర్ బచ్చన్ సినిమాకు అలానే జరిగింది.

సినిమా రిలీజ్ ముందు హీరో రవితేజ కన్నా డైరెక్టర్ హరీష్ శంకర్ ఎక్కువ ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ లో కనిపించారు. ఐతే సినిమా ఎలా వచ్చింది అన్నది డైరెక్టర్ కే తెలుస్తుంది. కానీ తను తీసిన సినిమా కచ్చితంగా తను బాగుంటుందని అనుకుంటాడు అందుకే హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ లో అంత కాన్ఫిడెంట్ గా కనిపించాడు. కానీ రిజల్ట్ వేరేలా వచ్చింది.

ఐతే ఇదే ప్రమోషన్స్ హీరో చేస్తే మాత్రం రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది. గురువారం రిలీజైన నాని సరిపోదా శనివారం యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని హీరోగా నటించిన ఈ సినిమా గురించి నాని ముందు నుంచి మంచి హైప్ పెంచుతూ వచ్చాడు. సినిమాలో నటించడమే కాదు ఏయే సీన్స్ లో ఆడియన్స్ హై ఫీల్ అవుతారన్నది గెస్ చేశాడు. నాని తన సినిమాను కూడా ఒక ఆడియన్ గా చూస్తాడు. అందుకే అతని జడ్జిమెంట్ ఫెయిల్ అవ్వలేదు.

ప్రమోషన్స్ ని డైరెక్టర్ చేస్తే రిజల్ట్ ఫ్లాప్ అవ్వగా హీరో చేస్తే మాత్రం సరిపోదా శనివారం లా సూపర్ హిట్ అయ్యింది. మరి ప్రమోషన్స్ సినిమాకు మంచి చేస్తాయా లేదా అన్నది పక్కన పెడితే ప్రమోషన్స్ ద్వారా పెరిగిన అంచనాలను అందుకునే స్టఫ్ సినిమాలో ఉండాలన్నది మాత్రం అర్థమవుతుంది.