Begin typing your search above and press return to search.

2024@టాలీవుడ్.. ఈ పాయింట్ ను గమనించారా?

2024.. అప్పుడే తొమ్మిది నెలలు అయిపోవస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ లో అనేక సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   26 Sep 2024 2:30 AM GMT
2024@టాలీవుడ్.. ఈ పాయింట్ ను గమనించారా?
X

2024.. అప్పుడే తొమ్మిది నెలలు అయిపోవస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ లో అనేక సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలు అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇంకొన్ని ఎవరూ ఊహించిన విధంగా ప్రేక్షకులను అలరించాయి. ఐపీఎల్, ఎన్నికల వల్ల వేసవి తప్ప.. మిగతా అన్ని వారాల్లో థియేటర్లలో బోలెడు చిత్రాలు విడుదల అయ్యి మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి.

అయితే ఈసారి సంక్రాంతి తర్వాత కొన్ని నెలలపాటు పెద్ద హీరోలెవరూ.. ప్రేక్షకుల ముందుకు రాలేదన్న విషయం తెలిసిందే. రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. సెకండాఫ్ లో సందడి చేసేందుకు ఫిక్స్ అయ్యారు.. చేస్తున్నారు కూడా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీతో జూన్ లాస్ట్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో జూనియర్ దేవర పార్ట్-1తో సెప్టెంబర్ 27వ తేదీన సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.

ఆ తర్వాత డిసెంబర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ తో రానున్నారు. డిసెంబర్ 6వ తేదీన పుష్ప-2ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. రీసెంట్ గా 75 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కానుంది. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల అవ్వనుంది. మేకర్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనప్పటికీ.. డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతికి స్టార్ హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున సందడి చేయగా.. ఆ తర్వాత ప్రభాస్ వచ్చారు.. ఇప్పుడు తారక్, బన్నీ, చరణ్ రానున్నారు. దీంతో ఒకే ఏడాదిలో టాలీవుడ్ లో ఇంత మంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారేమోనని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. అది యాదృశ్చికంగా జరిగినా.. కారణాలు ఏవైనా.. టాలీవుడ్ 2024కి ఇది ఒక ప్రత్యేకత అని అంటున్నారు.

ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యాక.. ఏడాదికి స్టార్ హీరోల సినిమాలు తక్కువే వస్తున్నాయని చెబుతున్నారు. కానీ 2024 ఇయర్ లో భారీగా వచ్చాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనేక మంది స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కాబట్టి.. వచ్చే ఏడాది బడా హీరోల సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతాయో వేచి చూడాలి.