అన్ని సినిమాలు బలగం కాలేవు..!
కమెడియన్ గా చేసిన వేణు ఇంత గొప్ప సినిమా ఎలా తీశాడు అనే రేంజ్ లో ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు.
By: Tupaki Desk | 28 Feb 2025 1:30 AM GMTవేణు యెల్దండి డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. కమెడియన్ గా చేసిన వేణు ఇంత గొప్ప సినిమా ఎలా తీశాడు అనే రేంజ్ లో ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. సినిమా కథ కథనం నటీనటుల ప్రతిభ అన్నీ బలగం సినిమాకు కలిసి వచ్చాయి. అంతేకాదు ఆ సినిమాకు భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకు బలంగా నిలిచింది. ఊరు పల్లెటూరు సాంగ్ తోనే సినిమాపై ఒక బజ్ ఏర్పడింది.
ఐతే బలగం సినిమాను చూసి అలాంటి సినిమాలనే చేయాలని కొందరు ప్రయత్నించారు. ముఖ్యంగా వేణుతో సమకాలీకుడు అయిన కమెడియన్ ధన్ రాజ్ కూడా మెగా ఫోన్ పట్టి సినిమా చేశాడు. రామం రాఘవం అంటూ ఒక ఫాదర్ అండ్ సన్ సినిమా చేశాడు. ఐతే ఆ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ కాగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఐతే డైరెక్టర్ గా వేణు సక్సెస్ అయ్యాడు కాబట్టి ధన్ రాజ్ సినిమా చేయలేదు. తనలో ఉన్న కథకుడిని ప్రేక్షకుడికి పరిచయం చేయాలని రామం రాఘవం చేశాడు.
సినిమా ఫలితం ఏంటన్నది పక్కన పెడితే డైరెక్టర్ ధన్ రాజ్ పాస్ మార్కులు తెచ్చుకున్నాడనే చెప్పొచ్చు. ఇక బలగం తరహాలోనే ఈమధ్యనే బాపు అనే సినిమా ఒకటి రిలీజైంది. ఈ సినిమా కూడా బలగం ఫార్మెట్ లోనే వచ్చింది. ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఐతే ఈ సినిమాలో బ్రహ్మాజి నటించడం వల్ల అందరికీ తెలిసింది కానీ సినిమా మాత్రం ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు.
సో బలగం వచ్చింది కదా అని రామం రాఘవం, బాపు సినిమాలను చూసేయరు. ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఆ సినిమాకు అలా కుదురుతుంది మళ్లీ అలా సెట్ అవ్వాలి అంటే కష్టమే. ఐతే తెలుగు ఆడియన్స్ కూడా మంచి సినిమాలను ఆదరిస్తున్నారు కానీ ఒకటే ఫార్మెట్ లో రెండు మూడు సినిమాలు వస్తే మాత్రం ఆడియన్స్ ఆదరించే అవకాశం లేదు. ఐతే కథ కథనాలు నటీనటుల ప్రతిభ దర్శకుడి ఎఫర్ట్ గుర్తిస్తే మాత్రం ప్రేక్షకులు ఆ సినిమాను ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.