టాలీవుడ్ ప్యూచర్ వారసుల చేతుల్లోనే!
ఇప్పటికే మహేష్ కుమారుడు గౌతమ్.. మాస్ రాజా రవితేజ కుమారుడు మహాదన్ భూపతి, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ వయసులు 18 నుంచి 21 లోపు ఉన్నాయి.
By: Tupaki Desk | 29 March 2025 6:30 AMఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్ జనరేషన్ హీరోలతో టాలీవుడ్ పాన్ ఇండియాలో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రీజనల్ మార్కెట్ ని దాటి ఇప్పుడీ హీరోలు సినిమాలు చేస్తున్నారు. హీరోలగా వీళ్ల కెరీర్ ఇంకా మరో 10- 15 ఏళ్ల మధ్యలో ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ లా మెయింటెనె చేయగల్గితే మరో 10 ఏళ్ల కెరీర్ ఉంటుంది. లేదంటే? అంతకు ముందు రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్యూచర్ స్టార్లను అందించాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకు లున్నారు. కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి హీరోలు దిగిపోతారు. బన్నీకి కూడా వారసుడు ఉన్నాడు. మహేష్‌కి కూడా ఓ కొడుకు ఉన్నాడు. ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి వారసుడిని అందించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. అయితే ఈ జనరేష్ కిడ్స్ కంటే ముందు టాలీవుడ్ ప్యూచర్ అన్నది వీళ్లపైనే ఆధారపడి ఉంది.
ఇప్పటికే మహేష్ కుమారుడు గౌతమ్.. మాస్ రాజా రవితేజ కుమారుడు మహాదన్ భూపతి, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ వయసులు 18 నుంచి 21 లోపు ఉన్నాయి. అంటే హీరో వయసుకు వచ్చేసినట్లే. వారసులను లాంచ్ చేయాలని ఇప్పటికే ఆ హీరోలపై ఒత్తిడి మొదలైంది. ముఖ్యంగా రవితేజ రిటైర్ మెంట్ ఇచ్చేసి కుమారుడిని తెరపైకి తెస్తే బాగుంటుందని చాలా మంది ఆశిస్తున్నారు.
కానీ రాజా వయసు మీద తగ్గేదే లే అంటూ సినిమాలు చేస్తున్నాడు. మహేష్ కి ఇంకా 15-20 ఏళ్ల కెరీర్ ఉంది. కానీ మరో ఐదేళ్లలో గౌతమ్ ని లాంచ్ చేస్తే బాగుంటుందని అభిమానలు ఆశిస్తున్నారు. ఇక పవన్ వారసుడిగా అకీరా నందన్ ఏ క్షణమైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పీకే రాజకీయంగా బిజీగా ఉండ టంతో? అకీరాని లాంచ్ చేయాలనే ఆలోచనలో ఆ ఫ్యామిలీ ఉంది. వీళ్లు లాంచ్ అవ్వడమే కాదు.
పరిశ్రమను అంతే విధిగా ముందుకు తీసుకెళ్లాల్సిన బరువైన బాధ్యత కూడా ఉంది. వాళ్ల నాన్నలే పాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న నేపథ్యంలో ఈ ప్యూచర్ స్టార్స్ అంతా పాన్ వరల్డ్ సినిమాలు చేసి తెలుగు పరిశ్రమ ఖ్యాతిని రెట్టింపు చేయాలి. అప్పుడే తండ్రికి తగ్గ తనయులుగా చిత్ర పరిశ్రమ చరిత్రలో నిలు స్తారు. బాలీవుడ్ లో ఖాన్ లు..కపూర్ వారసులు లాంచ్ అయితో ఎంతటి హైప్ ఉంటుందో? అంతకు మించిన హై ఈ వారసులకు టాలీవుడ్ లో ఉంటుంది.