మరాఠీ సంచలనంతో టాలీవుడ్ మంతనాలా!
4 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. అలా `సైరత్` అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ఈ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది.
By: Tupaki Desk | 22 Feb 2025 8:30 PM GMTమరాఠీ చిత్రం `సైరత్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిదే. నాగరాజ్ మంజులే వెండి తెరపై అద్భుతమైన ప్రేమ కథని ఆవిష్కరించిన తీరుకే బాలీవుడ్ కూడా ఫిదా అయింది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సైతం సినిమాని ఎంతో గొప్పగా ప్రశంసించారు. అమీర్ ప్రత్యేకంగా ముంబైకి రప్పించి మరీ సన్మానించారు. ఆ లవ్ స్టోరీకి అమీర్ ఖాన్ అంత గొప్పగా కనెక్ట్ అయ్యారు. అందులో హీరోయిన్ రింకు రాజ్ గురు నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది.
4 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. అలా `సైరత్` అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ఈ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత విషయం మరుగున పడింది. ఆ తర్వాత నాగరాజు మంజులే చాలా సినిమాలు చేసాడు గానీ అలాంటి హిట్ మాత్రం మళ్లీ పడలేదు. ప్రస్తుతం ఆయన మరాఠీలోనే సినిమాలు చేస్తున్నారు. ఇతర భాషల్లో అవకాశాలు వస్తున్నా వెళ్లడం లేదు.
ఈనేపథ్యంలో నాగరాజు మంజులేని టాలీవుడ్ రప్పించాలని కొత్తగా ప్రయత్నాలు మొదలైనట్లు కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. తెలుగులో పేరున్న ఓ డైరెక్టర్ కి సంబంధించిన సన్నిహితులు కొందరు నాగరాజుకి టచ్ లోకి వెళ్లారట. తమ బ్యానర్లో సినిమా చేయాలని కోరారట. అందుకు గాను భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసారట. అందుకే ఆయన ఆలోచించి చెబుతునాన్నరట.
దీంతో నిర్మాతలు మరో ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలిసింది . ఒకవేళ సినిమా చేయడం కుదరకపోతే గనుక లవ్ స్టోరీలు ఏవైనా ఉంటే తమ బ్యానర్ కి రైట్స్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుందామనే ప్రపోజల్ పెట్టారట. అయితే అందుకు నాగరాజ్ మంజులే ఎలాంటి నిర్ణయం చెప్పలేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి లీకైంది