Begin typing your search above and press return to search.

టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు.. దేవర ఏ స్థానంలో..

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత తెలుగు సినిమాలకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది.

By:  Tupaki Desk   |   20 Sep 2024 2:44 PM GMT
టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు.. దేవర ఏ స్థానంలో..
X

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత తెలుగు సినిమాలకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో తెలుగు సినిమాలకి అద్భుతమైన బిజినెస్ జరుగుతోంది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన నిర్మాతలు కూడా వందల కోట్ల బడ్జెట్ తో మూవీస్ చేస్తున్నారు. హైస్టాండర్డ్స్, యూనివర్సల్ కథలతో సినిమాలు చేయడం వలన ప్రపంచ వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ భాషలలో మూవీస్ రిలీజ్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది.

ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ గానే తెలుగు పాన్ ఇండియా సినిమాలపై భారీగా బిజినెస్ జరుగుతోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా అత్యధిక బిజినెస్ చేసిన తెలుగు హీరోల సినిమాల జాబితా చూసుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ మొదటి స్థానంలో ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 480+ కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ ఏడాది రిలీజ్ అయిన ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాపై ఏకంగా 380 కోట్ల వ్యాపారంతో రెండో స్థానంలో ఉంది.

గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ప్రభాస్ ‘సలార్’ సినిమాకి 350 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ఈ సినిమా టాప్ 3లో నిలిచింది. ఇక 350 కోట్ల వ్యాపారంతో ‘బాహుబలి 2’ టాప్ 4గా ఉంది. టాప్ 5లో ప్రభాస్ ‘సాహో’ మూవీ నిలిచింది. ఈ సినిమాపై 290 కోట్ల వ్యాపారం జరిగింది. టాప్ 6లో ఉన్న ‘ఆదిపురుష్’ సినిమాపై 250 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. అలాగే ‘రాధేశ్యామ్’ సినిమాపైనే 205 కోట్ల బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ఇది టాప్ 7లో ఉంది.

వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాల జాబితాలో టాప్ 2 నుంచి టాప్ 7 వరకు ప్రభాస్ సినిమాలే ఉండటం విశేషం. టాప్ 8 లో మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ ఉండగా, దీనిపై 200 కోట్ల వ్యాపారం అయ్యింది. సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోయే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాపైనే 180 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టాప్ 9 హైయెస్ట్ బిజినెస్ తెలుగు మూవీగా ఉంది. టాప్ 10లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ నిలిచింది. ఈ సినిమాపై 150 కోట్ల వ్యాపారం జరిగినట్లు టాక్.

ఆర్ఆర్ఆర్ – 480 కోట్లు+

కల్కి 2898ఏడీ – 380 కోట్లు

సలార్ – 350 కోట్లు

బాహుబలి 2 – 350 కోట్లు

సాహో – 290 కోట్లు

ఆదిపురుష్ – 250 కోట్లు

రాధే శ్యామ్ – 205 కోట్లు

సైరా నరసింహారెడ్డి – 200 కోట్లు

దేవర – 180 కోట్లు

పుష్ప ది రైజ్ – 150 కోట్లు