వీళ్లతో 30 కోట్లు అంటే ఆలోచించాల్సిన పనేలేదా!
నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది.
By: Tupaki Desk | 17 March 2025 6:00 AM ISTనిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో స్టార్ హీరోతో సినిమా తీయాలంటే అగ్ర నిర్మాతలే ఆలోచిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కొంత కాలంగా ప్రొడక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందంటే ? కారణం అదే. గీతా ఆర్స్ట్ కూడా అంతే ఆచి తూచి వ్యవహరిస్తుంది. సురేష్ బాబు, అల్లు అరవింద్ నిర్మాణంలో అపార అనుభవం గలవారు.
అందుకే నిర్మాణంలో ఎంతో జాగ్రత్తగా ప్లాన్డ్ గా ముందుకెళ్తున్నారు. కొన్ని బ్యానర్లు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తుంటాయి. ప్రస్తుతం సినారేలో స్టార్ హీరోతో సినిమా అంటే 100 కోట్లు మినిమంగా మారిపోయింది. అందులోనూ పాన్ ఇండియాలో లెక్కలో సినిమా చేయాలంటే 200 కోట్లు మినిమంగా కనిపిస్తుంది. ఇలా సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. మీడియం రేంజ్ హీరోలు కూడా ఎవర్నీ టచ్ చేసినా 50-80 కోట్ల మధ్యలో చెబుతున్నారు.
దీంతో మీడియం నిర్మాతలు వాళ్లతోనూ సినిమాలు నిర్మించాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. రెండు మూడు సంస్థలు కలిసి నిర్మించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కొంత మంది యంగ్ హీరోలు మాత్రం మీడియం రేంజ్ నిర్మాతలకు అందుబాటులో ఉన్నారు. సిద్దు జొన్నల గడ్డ, నవీన్ పొలిశెట్టి, అడవి శేష్, శ్రీవిష్ణు, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నిర్మాతలకు బాగా అందుబాటులో కనిపిస్తున్నారు.
వీళ్లతో సినిమా అంటే 10 నుంచి 30 కోట్ల లోపు ఖర్చు చేయోచ్చు. అంతకు మించి బడ్జెట్ పెంచని హీరో లగా నిర్మాతకు ఓ భరోసా కల్పిస్తున్నారు. సినిమా హిట్ అయితే భారీ లాభాలు చూస్తున్నారు. ఆ నమ్మ కాన్ని నిర్మాతలకు సదరు హీరోలు కల్పించగలిగారు. మార్కెట్ పెరిగిందని పారితోషికం పరంగానూ అధికంగా డిమాండ్ చేయని హీరోలగానూ వాళ్లకు పేరుంది.