Begin typing your search above and press return to search.

మిస్సయిన మెగా రికార్డ్.. టాప్ లో ఆ హీరోనే..

గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండు ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   28 Aug 2024 10:12 AM GMT
మిస్సయిన మెగా రికార్డ్.. టాప్ లో ఆ హీరోనే..
X

గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండు ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలను మళ్లీ సరికొత్తగా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ప్రతి స్టార్ హీరో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే రాబడుతోంది. దీంతో స్టార్స్ పుట్టినరోజు సందర్భంగా కల్ట్ సినిమాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి.

ఇప్పటికే ఖుషి 4K సినిమా అత్యధిక స్థాయిలో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ నటించిన సినిమాలు కూడా గట్టిగానే విడుదలయ్యాయి. మహేష్ బాబు యాక్షన్ మాస్ సినిమాలు కూడా వచ్చాయి. అందులో ఒక్కడు4K మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన మురారి సినిమా ఖుషి రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసింది.

‘మురారి’ చిత్ర రీ రిలీజ్‌ ట్రెండ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 5.4 కోట్ల గ్రాస్ ఫస్ట్ డే వసూలు చేసి, టోటల్‌గా 9 కోట్ల వరకూ రాబట్టి కల్ట్ క్లాసిక్‌గా మరోసారి నిలిచింది. ఈ జోరులోనే చిరంజీవి అభిమానులు ‘ఇంద్ర’ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న, వైజయంతీ మూవీస్ వారు 385 థియేటర్లలో ‘ఇంద్ర’ను గ్రాండ్‌గా రీ రిలీజ్ చేశారు.

మెగా ఫ్యాన్స్‌కు చిరు బర్త్ డే అంటే ప్రత్యేకమైన సందడి, దీంతో థియేటర్ల వద్ద అభిమానుల హంగామా ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. అయితే, వసూళ్ల పరంగా చూసినప్పుడు ‘మురారి’ ఫస్ట్ డే రికార్డును ‘ఇంద్ర’ తాకలేకపోయింది. ‘ఇంద్ర’ రీ రిలీజ్ ఫస్ట్ డే వసూళ్లు 3.05 కోట్ల గ్రాస్ వరకు మాత్రమే చేరాయి. ఇక అల్ టైమ్ లెక్కలో మురారి టోటల్ నెంబర్ ను బ్రేక్ చేయలేకపోయింది.

అయినా కూడా రీ రిలీజ్ సినిమాల్లో ‘ఇంద్ర’ తనదైన మ్యాజిక్‌ను మరోసారి చూపించిందని చెప్పాలి. ఫ్యాన్స్ హడావుడితో థియేటర్స్ కిక్కిరిసిపోయాయి. అది చూసి మెగాస్టార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక మురారి అయితే రీ రిలీజ్ రికార్డ్స్ లో టాప్ లో ఉంది. మరి ఆ రికార్డును ఏ సినిమా దాటుతుందో చూడాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.