సంక్రాంతి 100 కోట్ల క్లబ్.. ఏ సినిమాకు ఎంత టైమ్ పట్టిందంటే..
సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు చిత్ర పరిశ్రమకు స్పెషల్ బూస్ట్ లాంటిది. ఎడాది మొదటి పండగలో ఇండస్ట్రీకి మంచి సక్సెస్ రేట్ అందితే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది.
By: Tupaki Desk | 17 Jan 2025 7:02 AM GMTసంక్రాంతి పండుగ అంటేనే తెలుగు చిత్ర పరిశ్రమకు స్పెషల్ బూస్ట్ లాంటిది. ఎడాది మొదటి పండగలో ఇండస్ట్రీకి మంచి సక్సెస్ రేట్ అందితే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ప్రతి సంవత్సరం పెద్ద సినిమాలు ఈ సీజన్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటాయి. 2025 సంక్రాంతి సీజన్ కూడా అలాంటిదే. అయితే ఈసారి విడుదలైన మూడు ప్రధాన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమదైన రికార్డులను క్రియేట్ చేసుకోవడం విశేషం. ప్రత్యేకించి, మూడు చిత్రాలు గ్రాస్ పరంగా సెంటరీ మార్క్ ను అందుకోవడంలో పోటీ పడటం విశేషం.
గేమ్ చేంజర్
మొదటగా, గేమ్ చేంజర్ గురించి చెప్పుకుంటే, ఈ చిత్రం రెండో రోజుకే రూ. 100 కోట్ల మార్క్ ను అందుకుంది. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ పై ఉన్న భారీ అంచనాలు, ప్రీ రిలీజ్ హైప్, తొలిరోజు భారీ ఓపెనింగ్స్ దీనికి కారణం. అంతే కాకుండా అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రెండో రోజుకు 100 కోట్ల క్లబ్ లో చేరడం చరణ్ కెరీర్ లో మరో బెస్ట్ రికార్డ్ గా నిలిచింది. కానీ, టాక్ మిశ్రమంగా ఉండడం వసూళ్లపై కొంత ప్రభావం చూపింది.
సంక్రాంతికి వస్తున్నాం
ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విషయానికి వస్తే, ఈ సినిమా మూడవ రోజునే 100 కోట్ల క్లబ్ లో చేరింది. వెంకటేశ్ కెరీర్ లోనే ఇదొక గొప్ప ఫీట్ గా చెప్పుకోవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కుటుంబ వినోదాన్ని ప్రధానంగా ఉంచి రూపొందించబడింది. ప్రేక్షకుల నుండి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకు బలంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న హవా చూస్తే, ఇది వెంకటేశ్ కెరీర్ లో అత్యధిక వసూళ్ల చిత్రం అవ్వడం ఖాయమనే అనిపిస్తుంది. అలాగే బుకింగ్స్ లో ఈ సినిమా మిగతా రెండు సినిమాల కంటే టాప్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం.
డాకు మహరాజ్
డాకు మహారాజ్ మాత్రం నాలుగో రోజున 100 కోట్ల మార్క్ ను అందుకుంది. బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమా రుజువు చేసింది. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ఆరంభంలోనే మంచి ఆక్యుపెన్సీతో రికార్డులు నమోదు చేసింది. బాలయ్యకు ఇది నాలుగో 100 కోట్ల చిత్రం కావడం విశేషం. ఫ్యాన్స్ నుండి వచ్చిన మద్దతు, మంచి బిజినెస్ ఈ చిత్ర విజయానికి దోహదపడింది.
మూడు చిత్రాలు తక్కువ కాలంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం ఈ సంక్రాంతి సీజన్ కు అసలైన ప్రత్యేకత. గేమ్ చేంజర్ రెండు రోజుల్లో, సంక్రాంతికి వస్తున్నాం మూడు రోజుల్లో, డాకు మహారాజ్ నాలుగు రోజుల్లో ఈ ఫీట్ సాధించాయి. ఈ మూడు చిత్రాలు కలిపి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ సంక్రాంతి మార్కెట్ ను 300 కోట్లను దాటించాయి. ఈ సంక్రాంతి సీజన్ సినిమాల విజయం తెలుగు సినిమా స్థాయి ఎంత గొప్పగా ఉందో మరోసారి నిరూపించింది. సంక్రాంతి వంటి పండుగ సీజన్లు సినిమాలకు ఎంతగా ఉపయోగపడతాయో ఈ మూడు చిత్రాలు బాగా చూపించాయి.