పిక్‌టాక్ : బాలయ్య ఉంటే ఇంకా బాగుండేది
దాదాపుగా రెండు దశాబ్దాలుగా వీరు నలుగురిని ఒకే ఫ్రేమ్‌లో చూడటం లేదు. చిరంజీవి, వెంకటేష్‌లు రెగ్యులర్‌గా కనిపిస్తూ ఉన్నా నాగార్జున, బాలకృష్ణ మాత్రం తక్కువ కనిపిస్తున్నారు.
By: Tupaki Desk | 5 Feb 2025 9:24 AM GMTటాలీవుడ్‌లో ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. యంగ్ స్టార్ హీరోలు ఒకరిని మించి ఒకరు సినిమాలు చేస్తూ వసూళ్లు సాధిస్తూ ఉన్నారు. అయితే రెండు దశాబ్దాల క్రితం వరకు టాలీవుడ్ స్టార్ హీరోలు అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్. ఈ నలుగురు హీరోలు టాప్ స్టార్ హీరోలు. వరుస సినిమాలు ఫ్లాప్ అయినా, బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డా టాలీవుడ్‌లో వీరి తర్వాతే మరో హీరో అన్నట్లు దాదాపు రెండు దశాబ్దాలు సాగింది. 1980 నుంచి 2000 వరకు ఈ నలుగురు హీరోల జోరు సాగింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే యంగ్ స్టార్ హీరోల వందల కోట్ల సినిమాల మధ్య వీరి సినిమాలు కాస్త తగ్గుతున్నాయి. అయినా వీరికి ఉన్న క్రేజ్ తక్కువేం కాదు.
ఈ నలుగురు ఒకే స్టేజ్‌పై కనిపిస్తే చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నలుగురు ఒకే స్టేజ్‌పై ఒకే ఫ్రేమ్‌లో చూసి చాలా కాలం అయ్యింది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా వీరు నలుగురిని ఒకే ఫ్రేమ్‌లో చూడటం లేదు. చిరంజీవి, వెంకటేష్‌లు రెగ్యులర్‌గా కనిపిస్తూ ఉన్నా నాగార్జున, బాలకృష్ణ మాత్రం తక్కువ కనిపిస్తున్నారు. ఎప్పుడు కనిపించినా ముగ్గురు స్టార్స్ మాత్రమే కనిపిస్తున్నారు. ఇటీవల ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో జరిగిన ఒక వేడుకలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున పాల్గొన్నారు. తాజాగా ముగ్గురు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు స్టార్స్‌ను అలా చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంది.
ఈ ఫోటోకు చాలా మంది ఇదే ఫ్రేమ్‌లో బాలకృష్ణ కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది కదా అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలోనూ ఇండస్ట్రీ తరపున భారీ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో చిరంజీవి, వెంకటేష్ పాల్గొన్నారు. ఆ వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లు కలిసి కెమెరాకు ఇచ్చిన స్టిల్స్ అదిరి పోయాయి. అందులో నాగార్జున ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోటోలో కొంత మంది నాగార్జున ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. నలుగురు కలిసి ఉంటే చూడాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు.
తాజాగా ఈ ఫోటోలోనూ బాలకృష్ణ మిస్ కావడంతో సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ, నాగార్జున ఇద్దరిలో ఒకరు మిస్ అవుతున్నారు. కారణం ఏంటి అనేది ప్రత్యేకంగా తెలియడం లేదు. కానీ ఇద్దరు ఒకరు పాల్గొన్న కార్యక్రమంలో మరొకరు పాల్గొనడం లేదని క్లారిటీగా ఉంది. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే ఇలా ఒకరిని మరొకరు స్కిప్ చేస్తున్నారేమో అంటూ కొందరు అనుమానిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ మద్య ఏవో విభేదాలు అంటారు. కానీ ఇద్దరు ఎన్నో సందర్భాల్లో కలిశారు. కానీ బాలకృష్ణ, నాగార్జునలు మాత్రం కలవడం లేదు. ఇద్దరి మధ్య ఏం జరిగింది... అసలు ఇద్దరూ ఎందుకు ఎదురు పడటం లేదు అనేది తెలియాల్సి ఉంది. భవిష్యత్తులో అయినా వీరు కలవాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.