2024 బాక్సాఫీస్: అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాలీవుడ్ స్టార్స్
మన హీరోలు, దర్శకులు ఫోకస్ పెట్టాలేగాని బాక్సాఫీస్ ని షేక్ చేసే కథలని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాగలరని ఈ ఏడాది ప్రూవ్ అయ్యింది.
By: Tupaki Desk | 18 Dec 2024 1:53 PM GMTఈ ఏడాది టాలీవుడ్ చిత్రపరిశ్రమకి పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ లు ఎక్కువ వచ్చాయని చెప్పాలి. అలాగే రెండు సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరడం ద్వారా మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సత్తా నిరూపితం అయ్యింది. మన హీరోలు, దర్శకులు ఫోకస్ పెట్టాలేగాని బాక్సాఫీస్ ని షేక్ చేసే కథలని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాగలరని ఈ ఏడాది ప్రూవ్ అయ్యింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' వరల్డ్ వైడ్ గా సంచలన రికార్డులు సృష్టిస్తూ భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. సుకుమార్ క్రియేటివ్ విజన్, అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది. దీంతో రిపీటెడ్ గా ఈ సినిమాని చూసేందుకు థియేటర్స్ కి తరలివస్తున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ చైర్ లో అల్లు అర్జున్ సగర్వంగా కూర్చున్నాడని చెప్పొచ్చు. అతని మూడేళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సినిమా ద్వారా వచ్చింది.
13 రోజుల్లోనే ఈ మూవీ 1375 కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకుంది. దీని తర్వాత టాలీవుడ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ స్టార్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. 'కల్కి 2898ఏడీ' సినిమాతో ప్రభాస్ 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. రెండో సారి ఈ క్లబ్ లో చేరిన ఏకైక టాలీవుడ్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. 'కల్కి' మూవీ 1020 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా వసూళ్లు చేసింది. ఇక మూడో స్థానంలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర పార్ట్' 1 మూవీతో వచ్చాడు. ఈ సినిమా 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంది.
'దేవర' మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వన్ మెన్ షోతో అదరగొట్టాడు. యంగ్ హీరో తేజా సజ్జా 'హనుమాన్' సినిమాతో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న హీరోల జాబితాలో టాప్ 4లో ఉన్నాడు. 'హనుమాన్' మూవీ 296 కోట్ల కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంది. టాప్ లో 'గుంటూరు కారం' సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకొని కూడా ఏకంగా 175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.
రౌడీ బాయ్ సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' మూవీతో ఏకంగా 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని టాప్ 6లో నిలిచాడు. ఈ సినిమా అంచనాలకి మించి భారీ వసూళ్లు అందుకోవడం విశేషం. నెక్స్ట్ 'లక్కీ భాస్కర్' మూవీతో దుల్కర్ సల్మాన్ టాప్ 7 హీరోగా మారాడు. అతని కెరియర్ లో కూడా ఇదే అత్యధిక కలెక్షన్స్ చిత్రం కావడం విశేషం. ఈ మూవీ 111.3 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక టాప్ 8లో 'సరిపోదా శనివారం' సినిమాతో నేచురల్ స్టార్ నాని ఉన్నాడు. ఈ సినిమాతో నాని మరోసారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు.