బాలీవుడ్ లో బ్యాలెన్స్ ఉంది బన్నీ ఒక్కడేనా?
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోల్లో ఇప్పటికే బాలీవుడ్ లో కొంత మంది హీరోలు లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Feb 2025 10:30 PM GMTటాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోల్లో ఇప్పటికే బాలీవుడ్ లో కొంత మంది హీరోలు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మోజు కంటే ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్నేళ్ల క్రితమే `జంజీర్` రీమేక్ తో లాంచ్ అయ్యాడు. ఆ సినిమా తెలుగులో `తుఫాన్` గా రిలీజ్ అయింది. కానీ ప్లాప్ అయింది. ఇక డార్లింగ్ ప్రభాస్ `సాహో` సినిమాతో హిందీ లో లాంచ్ అయ్యాడు.
తెలుగులో పాటు హిందీలోనూ తెరకెక్కిన చిత్రమిది. ఆ తర్వాత 'అదిపురుష్' సినిమాతో మరోసారి బాలీవుడ్ చిత్రం చేసాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రభాస్ కి అక్కడ పెద్దగా కలిసి రాలేదు. `ఆదిపురుష్` అయితే విమర్శలే తెచ్చి పెట్టింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ `వార్ 2` తో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. సినిమాపై భారీ అంచనా లున్నాయి.
ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. మరి ఈ లిస్ట్ లో బాలీవుడ్ లో లాంచ్ అవ్వని పాన్ ఇండియా స్టార్ ఎవరు? అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. `పుష్ప` ప్రాంచైజీతో పాన్ ఇండియాలో బన్నీ ఓ బ్రాండ్ అయ్యాడు. కానీ ఇంకా హిందీ సినిమా చేయలేదు. అవకాశాలు వస్తున్నాయి గానీ తెలుగు సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత హిందీ సినిమాలకు ఇవ్వడం లేదు.
ఈ క్రమంలోనే లాంచ్ అవ్వలేదు. మరి మరో రెండు మూడు తెలుగు సినిమాల తర్వాతైనా బాలీవుడ్ గురించి ఆలోచిస్తాడేమో చూడాలి. ఇంకా యంగ్ హీరోలు నిఖిల్, తేజ సజ్జా కూడా పాన్ ఇండియాలో పేరు తెచ్చుకున్నారు. కానీ హిందీ సినిమా ఆలోచనలు చేయలేదు. తెలుగు నుంచే పాన్ ఇండియాలో కంటున్యూ అవుతున్నారు.