మహేష్ తో మొదలైన ట్రెండ్ చివరికిలా!
రిలీజ్ కు ముందు హిట్ కొడుతున్నామని సవాల్ విసరడం అంత సులభం కాదు. కంటెంట్ పై ఎంతో నమ్మకం ఉంటే తప్ప సాధ్యం కానిది.
By: Tupaki Desk | 13 March 2025 3:00 PM ISTరిలీజ్ కు ముందు హిట్ కొడుతున్నామని సవాల్ విసరడం అంత సులభం కాదు. కంటెంట్ పై ఎంతో నమ్మకం ఉంటే తప్ప సాధ్యం కానిది. అయితే ఈ మధ్య కాలంలో అలాంటి సవాళ్లు ఎక్కువ అవుతు న్నాయి. వాళ్ల నమ్మకం కూడా అంతే బలంగా నిలబడుతుంది. ఇటీవలే నేచురల్ స్టార్ నాని `కోర్టు` సినిమా నచ్చక పోతే తాను నటిస్తోన్న `హిట్ -3` చిత్రాన్ని చూడొద్దని పబ్లిక్ గానే చెప్పాడు. ఆ విషయంలో నాని ప్రూవ్ చేసుకున్నాడు.
ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో ప్రీమియర్ల జోరు ఊపందుకుంది. అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన `దిల్ రూబ` కూడా ఇదే రోజున రిలీజ్ అయింది. ఈ సినిమా కంటెంట్ విషయంలో డైరెక్టర్ కాన్పిడెన్స్ మాటల్లోనే కనిపిస్తుంది. సినిమాలో హీరో ఫైట్స్ నచ్చకపోతే సినిమా రిలీజ్ అయిన మధ్నాహ్నం ఇంటికొచ్చి మరీ తన్నమని సవాల్ విసిరాడు.
మరేం జరుగుతుందన్నది చూడాలి.
అలాగే మార్చి 28న నితిన్ హీరోగా నటించిన `రాబిన్ హుడ్` రిలీజ్ అవుతుంది. `రాబిన్ హుడ్` లో పాత్రలు గుర్తుండకపోతే గనుక పేరు మార్చుకుం టానని నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ కూడా సవాల్ విసి రారు. నితిన్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతుంది. ఈ నేపథ్యంలో విజయంపై అతడు కూడా ధీమాగానే ఉన్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఇంత వరకూ ఇతడికి వైఫల్యం ఎదురు కాలేదు. ఈ నేపథ్యంలో సక్సెస్ కొడుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.
అలాగే `పాగల్` సినిమా సమయంలో విశ్వక్ సేన్ కూడా ఇలాగే సవాల్ విసిరాడు. కానీ సినిమా సరిగ్గా ఆడలేదు. `మ్యాడ్ స్క్వేర్ ` కూడా మార్చి 28న రిలీజ్ అవుతుంది.`మ్యాడ్` భారీ విజయం సాధించిన నేపథ్యంలో స్క్వేర్ పై కూడా మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోకపోతే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తానని నిర్మాత నాగవంశీ సవాల్ విసిరారు. లాజిక్కులు వెతకకుండా ప్రేక్షకులు రెండున్న ర గంటలు ఎంజాయ్ చేసే చిత్రమిదని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అలాగే రిలీజ్ కు ముందు `దేవర` విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కాలర్ ఎగరేసి మరీ కొడుతు న్నాం అన్నాడు. అన్నట్లే ఆ సినిమా మంచి విజయం సాధించింది. అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ కూడా `మహర్షి` రిలీజ్ అయి సక్సస్ అయిన అనంతరం కాలరెగరేసి మరీ కొట్టాం అని అన్నారు. టాలీవుడ్ లో హీరో కాలర్ ఎగరేయడం అన్నది మహేష్ తోనే మొదలైంది. అటుపై ఇంకాస్త అడ్వాన్స్ గా రిలీజ్ కు ముందే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ తర్వత సక్సెస్ అయితే సక్సెస్ మీట్ లో కొట్టామని గర్వంగా కాలరెగరేస్తున్నారు. గత ఏడేనిమిదేళ్లగా ఇండస్ట్రీలో వచ్చిన మార్పు ఇది.