Begin typing your search above and press return to search.

స్టైల్‌లో బాలీవుడ్‌ను మించుతున్న మన స్టార్స్‌

విజయ్‌ దేవరకొండ ఏకంగా బాలీవుడ్‌ స్టార్స్‌ను మాత్రమే కాకుండా హాలీవుడ్‌ పాప్‌ స్టార్స్‌ను సైతం టార్గెట్‌ చేస్తూ స్టైలిష్ ఐకాన్‌గా కనిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

By:  Tupaki Desk   |   27 March 2025 12:30 PM
స్టైల్‌లో బాలీవుడ్‌ను మించుతున్న మన స్టార్స్‌
X

ఒకప్పుడు బాలీవుడ్‌ స్టార్స్‌తో స్టైల్‌ విషయంలో సౌత్‌ స్టార్స్ పోటీ పడలేక పోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. గతంతో పోల్చితే ఇప్పుడు అంతా మారింది. టాలీవుడ్‌ స్టార్స్‌ స్టైలింగ్‌ ముందు బాలీవుడ్‌ స్టార్స్ సైతం దిగదుడుపే అన్నట్లుగా పరిస్థితి ఉంది. టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్‌ యూత్‌ ఐకాన్‌గా, స్టైలిష్ ఐకాన్‌గా గుర్తింపు దక్కించుకుంటున్నారు. యంగ్‌ హీరోల్లో పలువురు స్టైలింగ్‌ విషయంలో అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. విజయ్‌ దేవరకొండ ఏకంగా బాలీవుడ్‌ స్టార్స్‌ను మాత్రమే కాకుండా హాలీవుడ్‌ పాప్‌ స్టార్స్‌ను సైతం టార్గెట్‌ చేస్తూ స్టైలిష్ ఐకాన్‌గా కనిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించినా స్టైలిష్ లుక్‌తో చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఇటీవల ఒక షూటింగ్‌కి వెళ్తున్న సమయంలో ఎయిర్‌ పోర్ట్‌లో తీసుకున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. ఇతడి స్టైలిష్‌ లుక్ మాములుగా లేదంటూ పలువురు కామెంట్ చేశారు. విజయ్ దేవరకొండ తాను స్టైల్‌గా ఉండటం మాత్రమే కాకుండా తన రౌడీ బ్రాండ్‌ తో తన అభిమానులను సైతం స్టైలిష్‌గా మారుస్తున్నాడు. రౌడీ బ్రాండ్‌ దుస్తులు స్టైలింగ్‌ విషయంలో ఇండియాలోనే టాప్ బ్రాండ్స్‌లో చోటు సంపాదించింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ఏ స్థాయిలో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడో చూడాలి.

హీరోలు సినిమాల్లో స్టైల్‌గా కనిపించినా కనిపించకున్నా ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలకు హాజరు అయిన సమయంలో చాలా స్టైలిష్‌గా కనిపించడం మనం చూస్తూ ఉంటాం. ఇటీవల రామ్‌ చరణ్ డిఫరెంట్‌ హెయిర్ స్టైలింగ్‌తో, ఎక్కువ గడ్డంతో కనిపించాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా కోసం రామ్‌ చరణ్ కొత్త లుక్‌కి మారాడు. సినిమాలో మాస్‌గా కనిపించినా ఆ హెయిర్‌ స్టైల్‌, గడ్డంతో బయట చాలా స్టెలిష్‌గా కనిపిస్తున్నాడని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

ఇటీవల ఎన్టీఆర్‌ 'దేవర' సినిమా ప్రమోషన్ కోసం జపాన్‌ వెళ్లాడు. అక్కడ ఎన్టీఆర్‌ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఎన్టీఆర్‌ సన్నగా నాజూకుగా భలే ఉన్నాడే అంటూ సోషల్‌ మీడియా వరల్డ్‌లో అంతా కామెంట్‌ చేశారు. ఎన్టీఆర్‌ మూడు విభిన్నమైన ఔట్‌ ఫిట్స్‌ లో జపాన్‌లో తెగ సందడి చేశాడు. ఎన్టీఆర్‌ హెయిర్‌ స్టైల్‌, ఇతర స్టైలిష్ లుక్‌ సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్‌ స్టైల్‌ విషయంలో బాలీవుడ్‌ హీరోలను వెనక్కి నెట్టే విధంగా ఉన్నాడంటూ అభిమానులు మాట్లాడుకున్నారు.

వీళ్లు మాత్రమే కాకుండా అల్లు అర్జున్‌ మరికొందరు హీరోలు బాలీవుడ్‌ హీరోలను తలదన్నే విధంగా స్టైలిష్ అవతార్‌లో కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్‌ సైతం స్టైలిష్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. బాలీవుడ్‌లో కనిపించే హీరోయిన్స్‌తో పోల్చితే సౌత్‌ హీరోయిన్స్ ఏమాత్రం తగ్గకుండా స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా రష్మిక మందన్న, సమంతలు స్టైలిష్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలతో పోటీ పడుతున్నారు.