మండే ఎండైనా సరే తగ్గేదేలే!
శీతాకాలం ముగింపు దశకు వచ్చేసింది. ఇక వచ్చేది వేసవి. మండే ఎండలు. భానుడి భగభగల్ని తట్టుకోవడానికి రెడీ అవ్వాల్సిందే.
By: Tupaki Desk | 3 Jan 2025 4:30 PM GMTశీతాకాలం ముగింపు దశకు వచ్చేసింది. ఇక వచ్చేది వేసవి. మండే ఎండలు. భానుడి భగభగల్ని తట్టుకోవడానికి రెడీ అవ్వాల్సిందే. ఇలాంటి సమయంలో సినిమా షూటింగ్ లకు కూడా బ్రేక్ ఇస్తారు. వీలైనంత వరకూ ఏప్రిల్, మే నెలల్లో షూటింగ్ లకు వెళ్లడానికి ఏటీమ్ ఒప్పుకోదు. అత్యవసరమైతే తప్ప సెట్స్ కు వెళ్లే హీరోలు తక్కువ. అయితే 2025 సమ్మర్ మాత్రం అలా ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఈ వేసవికి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నాయి.
ఎస్ ఎస్ ఎంబీ 29 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి లేదా మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి షూటింగ్ మొదలైతే? మహేష్ సహా యూనిట్ అంతా పరుగులు పెట్టాల్సిందే. తాను పూర్తి చేయాలనుకున్న పార్ట్ మొత్తం పూర్తయ్యే వరకూ ఎండ కొండ లేకుండా పనిచేస్తారాయన. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా మొదలవుతుంది. ముందుగా సెట్స్ , లుక్ టెస్ట్ నిర్వహిస్తారు.
అటుపై షూట్ కి వెళ్లాలన్నది గురూజీ ప్లాన్. త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో? సమయం తీసుకున్నా హిట్ కొట్టే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్ట్ కూడా ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. మార్చిలోగా తారక్` వార్ -2` నుంచి బయటకు వచ్చేస్తాడు. అటుపై కొన్ని రోజుల అనంతరం ఏప్రిల్ మిడ్ నుంచి సెట్స్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక డార్లింగ్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన పనిరాక్షసుడు.
విశ్రాంతి తీసుకున్నంత కాలం తీసుకుంటాడు. ఒక్కసారి షూటింగ్ లోకి వచ్చాడంటే మళ్లీ ఆ మోడ్ నుంచి అంత తొందరగా బయటకు రాడు. ఒకేసారి రెండు భారీ సినిమా షూటింగ్ లకైనా హాజరయ్యే సామర్ధ్యం ఉన్న నటుడాయన. `యానిమల్` ఫేం సందీప్ రెడ్డి వంగతో డార్లింగ్ చిత్రం కూడా వేసవిలోనే షూట్ మొదవుతుంది. అలాగే మెగాస్టా చిరంజీవి హీరోగా `దసరా` ఫేం శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కూడా సమ్మర్ లోనే షూర్ అవుతుంది. ప్రారంభోత్సవం నిర్వహించి `విశ్వంభర` రిలీజ్ తర్వాత పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా పాన్ ఇండియా హీరోలంతా మండే ఎండైనా సరే తగ్గేదేలే అంటూ బరిలోకి దిగుతున్నారు.