'మే'లో మూడు భారీ సినిమాలు.. పండగే పండగ..
2025లో అప్పుడే రెండు నెలలు కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇప్పటి వరకు అనేక సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.
By: Tupaki Desk | 1 March 2025 6:00 AM IST2025లో అప్పుడే రెండు నెలలు కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇప్పటి వరకు అనేక సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కొన్ని హిట్స్ గా మారాయి. మరికొన్ని అంచనాలకు మించి రాణించాయి. ఇంకొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. అయితే ఎప్పటిలానే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
అయితే మార్చిలో వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కిరణ్ అబ్బవరం దిల్ రూబా సహా అనేక చిత్రాలు రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద తమ లక్ ను టెస్ట్ చేసుకోనున్నాయి. అదే సమయంలో ఇప్పుడు మే నెలలో విడుదల కాబోయే సినిమాల కోసం జోరుగా చర్చ సాగుతోంది.
నేచురల్ స్టార్ నాని.. హిట్ 3 మూవీతో మే నెలను స్టార్ట్ చేయనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో నాని అర్జున్ సర్కార్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భారీ బజ్ క్రియేట్ చేసింది.
హిట్ ప్రాంచైజీలో మూడో సినిమాగా వస్తుండడం, ఇప్పటికే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండటంతో.. హిట్ 3 విజయం సాధిస్తుందని అంటున్నారు. హిట్ 3 రిలీజ్ కాబోయే మే1న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెట్రోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నారు.
రీసెంట్ గా కంగువా ఫ్లాప్ అవ్వడంతో సూర్య.. ఈ మూవీతో హిట్ కొడతారని అంతా అంచనా వేస్తున్నారు. వింటేజ్ యాక్షన్ నేపథ్య చిత్రంగా మూవీ ఉండనుందని టాక్. మే నెలాఖరులో 30వ తేదీన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ విడుదల కానుంది. సినిమాలో విజయ్.. కొత్త అవతార్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
టీజర్ లో విజయ్ పోలీస్ గెటప్ లో ఓ రేంజ్ లో కనిపించడం, బ్యాక్ డ్రాప్ సీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి పెరిగింది. విజయ్ నుంచి స్పెషల్ కంటెంట్ వస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మేలో మూడు భారీ హైప్ ఉన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో టాలీవుడ్ మూవీ లవర్స్ కు పండగే పండగ! మరి ఆ చిత్రాలు ఎలాంటి హిట్ అవుతాయో వేచి చూడాలి.