Begin typing your search above and press return to search.

500 కోట్లు.. నెక్స్ట్ ఎవరు?

ఈ ఏడాదిలో అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కి నెక్స్ట్ 500 కోట్ల కలెక్షన్స్ ని టాలీవుడ్ కి అందించే సత్తా ఉంది.

By:  Tupaki Desk   |   20 July 2024 4:52 AM GMT
500 కోట్లు.. నెక్స్ట్ ఎవరు?
X

బలమైన కథకి అంతే బలమైన హీరో తోడైతే 500 కోట్లు కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదని గత కొంతకాలంగా టాలీవుడ్ నుంచి వస్తోన్న సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. రాజమౌళి ‘బాహుబలి 1’తో మొదటి సారి 500+ కోట్ల కలెక్షన్స్ సినిమాని టాలీవుడ్ కి అందించారు. ఈ సినిమా క్రియేట్ చేసిన హైప్ తో ‘బాహుబలి 2’ ఏకంగా 1500+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించి రికార్డులు సృష్టించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో 300+ కోట్ల దగ్గర ఆగిపోయాడు.

మళ్ళీ రాజమౌళినే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో 500+ కోట్ల కలెక్షన్స్ ని సాధించారు. ఆయన నుంచి రెండు సినిమాలు 1000 కోట్లకి పైగా కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేశాయి. నెక్స్ట్ రాజమౌళి 2000+ కోట్ల కలెక్షన్స్ ని SSMB29 తో లక్ష్యంగా పెట్టుకున్నారు. హీరోగా ప్రభాస్ బాహుబలి 1, 2 సినిమాలతో 500+ కోట్ల క్లబ్ హీరోగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ లిస్టులోకి వచ్చారు.

డార్లింగ్ ప్రభాస్ సలార్ పార్ట్ 1, కల్కి 2898ఏడీ పార్ట్ 1 సినిమాలతో మరోసారి 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి ఎవ్వరికి సాధ్యం కానీ ఫీట్ అందుకున్నారు. ప్రభాస్ నుంచి రాబోయే సలార్ పార్ట్ 2, కల్కి పార్ట్ 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు చాలా ఈజీగా 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ సాధిస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆయన సినిమాల కలెక్షన్స్ 500 కోట్లు ఆ పైన లెక్కపెట్టుకోవాల్సిందే అని అంటున్నారు.

ప్రభాస్ తర్వాత ఈ సోలోగా 500+ కోట్ల క్లబ్ హీరోగా మారే ఛాన్స్ ఎవరికి ఉందని చూసుకుంటే ప్రస్తుతం ముగ్గురు హీరోలు కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో 500 కోట్ల హీరోగా మారే ఛాన్స్ ఉంది. అలాగే ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలోకి రావొచ్చు. ‘గేమ్ చేంజర్’ సినిమా ఏమైనా అద్భుతాలు చేస్తే రామ్ చరణ్ కూడా 500 కోట్ల హీరోగా మారుతాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే డైరెక్ట్ గా కుంభస్థలాన్ని గురిపెడుతున్నాడు.

ఈ ఏడాదిలో అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కి నెక్స్ట్ 500 కోట్ల కలెక్షన్స్ ని టాలీవుడ్ కి అందించే సత్తా ఉంది. వీరిలో ఎవరు ఆ రికార్డ్ అందుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఈ ముగ్గురు హీరోల నుంచి ఈ ఏడాది రాబోయే సినిమాలపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే బిజినెస్ కూడా 300-400 కోట్ల మధ్యలోనే జరుగుతున్నాయి. ఈ స్థాయిలో షేర్ అందుకోవాలంటే కచ్చితంగా 500 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవాల్సిందే.