చీరకట్టులో దేవియాని.. ఎంత అందంగా ఉందొ..
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నార్త్ ఇండియన్ బ్యూటీస్ సందడి ఫుల్ గా ఉంటుంది.
By: Tupaki Desk | 10 Aug 2024 3:30 PM GMTసోషల్ మీడియా ఓపెన్ చేస్తే నార్త్ ఇండియన్ బ్యూటీస్ సందడి ఫుల్ గా ఉంటుంది. రెగ్యులర్ గా అందాల భామలు ఇన్ స్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటోషూట్ లతో తమ ఫ్యాన్స్ కి కావాల్సినంత నేత్రానందం అందిస్తూ ఉంటారు. దర్శక, నిర్మాతలు కూడా తమ సినిమాలకి కావాల్సిన హీరోయిన్స్ ని ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్స్ చూసి ఎంపిక చేసుకుంటారనే టాక్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పాపులర్ అయ్యి తరువాత వెండితెరపై అవకాశాలు సొంతం చేసుకున్న భామలు చాలా మంది ఉన్నారు.
మోడలింగ్ ని కెరియర్ గా ఎంచుకున్న బ్యూటీస్ అందరికి కూడా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ కేరాఫ్ గా మారింది. ఇదిలా ఉంటే తెలుగులో సైతాన్, సేవ్ ది టైగెర్స్ వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ దేవియాని శర్మ. ఈ బ్యూటీ అనగనగా అనే సిరీస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత నవీన్ చంద్ర భానుమతి రామకృష్ణ సినిమాలో కీలక పాత్రలో నటించింది.
అయితే మహి వి రాఘవ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సైతాన్ దేవయానికి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సేవ్ ది టైగెర్స్ సిరీస్ లో చైతన్య కృష్ణ వైఫ్ క్యారెక్టర్ లో దేవయాని శర్మ నటించింది. ఈ సిరీస్ రెండు సీజన్స్ కి మంచి స్పందన వచ్చింది. మహి వి రాఘవ దర్శకత్వంలోనే ఈ సిరీస్ తెరకెక్కింది. రీసెంట్ గా అంజలి లీడ్ రోల్ లో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ లో కూడా దేవయాని శర్మ కీలక పాత్రలో నటించింది.
ఓ వైపు వెబ్ సిరీస్ లు నటిస్తూనే దేవయాని సినిమా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో సంపంగి లాంటి అందంతో మెరిసిపోతున్న ఫోటోలని దేవయాని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలకి నెటిజన్లు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హెయిర్ లూజ్ గా వదిలేసి వయ్యారంగా చీర కొంగుని నడుముకి పెడుతూ తీసుకున్న ఈ స్టిల్స్ చాలా అందంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.