ప్రెట్టీ ఇన్ పింక్ లో ప్రగ్యాజైశ్వాల్ పేంపరింగ్
ప్రగ్యా జైశ్వాల్ ఇన్ స్టా సంచలనాల పరిచయంతో పనేముంది. చిట్టిపొట్టి దుస్తుల్లో మంటలు రేపిన సంద ర్భాలెన్నో.
By: Tupaki Desk | 12 Aug 2024 7:30 AM GMTప్రగ్యా జైశ్వాల్ ఇన్ స్టా సంచలనాల పరిచయంతో పనేముంది. చిట్టిపొట్టి దుస్తుల్లో మంటలు రేపిన సంద ర్భాలెన్నో. ఫ్యాషన్ వరల్డ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని దక్కిచుకుంది. చేతిలో సినిమాలు లేకపోయినా ఇంకా కాంపిటీషన్ లో ఉంది అంటే? అందుకు కారణం ప్రగ్యా లో ఆ రకమైన అప్పిరియన్స్ అనడంలో డౌట్ లేదు. సందర్భాన్ని బట్టి చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. డిజైనర్ దుస్తుల్లో అగ్గిరాజేస్తుంది.
తాజాగా అమ్మడు మరోసారి ఆల్ట్రా మోడ్రన్ బ్యూటీ లుక్ లో అదరగొట్టింది. లైట్ పింక్ కలర్ ఔట్ ఫిట్..అదమైన మ్యాకప్ లో సోయగం అగ్గిరాజేసింది. అమ్మడి హైట్ ని మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసిన గౌనులో ఎంతో అందంగా ముస్తాబైంది. కాళ్లకు హై హీల్స్ ధరించింది, స్కిన్ టోన్ మరింత షైనింగ్ అవుతుంది. పాల నురుగుల సౌందర్యంతో ఆహా అనిపిస్తుంది. వయసు 36 దాటినా 26 బ్యూటీలా మురిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రగ్యా లో బ్యూటీని ఫ్యాన్స్ అంతే ఆస్వాదిస్తున్నారు. ప్రెట్టీ ఇన్ పింక్ అంటూ కుర్రాళ్లంతా పొగిడేస్తున్నారు. ఇక ప్రపోజల్స్ కైతే కొదలేదు. అమ్మడు ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు. బ్యూటీ అందానికి ఫిదా అయిన వారంతా తమదైన శైలిలో ప్రపోజ్ చేస్తున్నారు.
ఇక ప్రగ్యాజైశ్వాల్ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు..హిందీ..తమిళ్ లో సినిమాలు చేసినా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. ఈ రెండు భాషలకంటే బెటర్ గా తెలుగులోనే సినిమాలు చేసింది. ఈ మధ్యనే తన తొమ్మిదేళ్ల క్రితం నాటి కల నిజమయ్యే మరో అవకాశం అందుకుంది. అక్షయ్ కుమార్ ..తాప్సీ ..వాణీ కపూర్ నటించిన సినిమా `ఖేల్ ఖేల్ మే` చిత్రంలో ప్రగ్యా అవకాశం అందుకుంది. ఇందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తుంది. త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది.