Begin typing your search above and press return to search.

సామజవరగమన బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..

లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు అయిన హుస్సేన్ షా కిర‌ణ్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశలో ఉంది.

By:  Tupaki Desk   |   31 July 2024 12:30 PM GMT
సామజవరగమన బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..
X

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి.. కడుపుబ్బా నవ్వించి సూపర్ హిట్ అయిన సామజవరగమన మూవీ హీరోయిన్ గుర్తుందా? అదేనండీ రెబా మోనిక జాన్. ఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో అలరించింది. తెలుగులో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ వరుస అవకాశాలు అందుకుంటోంది అమ్మడు. ప్రస్తుతం సామజవరగమన హీరో శ్రీవిష్ణుతో మరో సినిమా కూడా చేస్తోంది.


లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు అయిన హుస్సేన్ షా కిర‌ణ్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మరో రెండు తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తోంది రెబా మోనికా జాన్. బెంగళూరులోని మలయాళ ఫ్యామిలీకి చెందిన బ్యూటీ.. క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత మోడల్ గా కొంత కాలం రానించింది. పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ పాపులర్ అయింది.


అయితే సినిమాల్లోకి వచ్చే ముందు ధాత్రి హెయిర్ ఆయిల్ వంటి పలు యాడ్స్ లో నటించింది. 2016లో జాకోబింటె స్వర్గరాజ్యం మలయాళం ఫ్యామిలీ డ్రామా మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రత్నన్ ప్రపంచం చిత్రంతో కన్నడలో తన లక్ ను టెస్ట్ చేసుకుంది. అలా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు తెలుగులో కూడా మెల్లగా బిజీ అవుతోంది రెబా మోనిక జాన్.


అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది రెబా. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం పిక్స్ షేర్ చేస్తుంటోంది. వెకేషన్స్ కు వెళ్తూ అక్కడి పిక్స్ ను పోస్ట్ చేస్తుంటోంది. పొట్టి బట్టలతో పాటు చీరల్లో అందాలు ఆరబోస్తుంటోంది. ఒక్కోసారి స్టైలిష్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంటోంది అమ్మడు. సామజవరగమన తర్వాత తెలుగులో కూడా భారీగా ఫాలోవర్స్ పెంచుకుంటోంది. తన లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది బ్యూటీ.

పిక్ కలర్ మినీ స్కర్ట్ వేసుకుని రెబా.. నవ్వుతూ ఫుల్ హ్యాపీ మూడ్ లో కనిపించింది. ఓ రిసార్ట్ లో దిగిన పిక్స్ తో సందడి చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెబా కొత్త పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. రెబా అందానికి ఫిదా అయ్యామని చెబుతున్నారు నెటిజన్లు. లైకులు కొడుతూ సందడి చేస్తున్నారు. బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరు రెబా న్యూ పిక్స్ ను చూశారా?