సంయుక్త.. నిండైన చీరలో ఎంత గ్లామరో..
సంయుక్త మీనన్ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటోంది.
By: Tupaki Desk | 5 Aug 2024 8:30 AM GMTసంయుక్త మీనన్ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటోంది. తెలుగులో ఆమెకు "భీమ్లా నాయక్" సినిమా ద్వారా పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా విజయంతో, సంయుక్తకు టాలీవుడ్‌లో వరుసగా మంచి అవకాశాలు లభించాయి.
"భీమ్లా నాయక్" తర్వాత సంయుక్త "బింబిసార", "సార్", "విరూపాక్ష" వంటి చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. ఈ విజయాలతో సంయుక్త టాలీవుడ్‌లో ఒక గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ప్రస్తుతం నిఖిల్ సరసన "స్వయంభూ" చిత్రంలో నటిస్తూ, మరోసారి తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది.
సంయుక్త టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా మాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. ఈ బ్యూటీ ఇటీవలే బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టింది. చరణ్ తేజ్ ఉప్పాలపాటి దర్శకత్వంలో రూపొందుతున్న "మహారాగ్ని" సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌లో ఆమె కారు రేసింగ్ సీక్వెన్స్‌లో, గ్లామరస్ లుక్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సంయుక్త సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. తన ఫోటోషూట్స్ ద్వారా ఆమె గ్లామర్ షో చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఏ దుస్తులలోనైనా, అది చీరల్లోనైనా, మోడ్రన్ డ్రెస్సుల్లోనైనా, ఆమె తన అందం, క్యూట్ నెస్‌ను ఏ మాత్రం తగ్గకుండా చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆమె షేర్ చేసిన గ్రీన్ కలర్ కలర్ ప్లెయిన్ శారీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోల్లో ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో, క్రేజీ నెక్ సెట్ ధరించి స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తోంది. శారీ పైటను కాస్త పక్కకు వేసుకుని, ఎద అందాలను హైలైట్ చేస్తూ క్లాసీగా కనిపిస్తూ, మరింత గ్లామర్‌ను చూపిస్తోంది. అందం విషయంలో సంయుక్త తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. సినిమాలతో మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా తన అభిమానులను పెంచుకుంటూ, ప్రతి రోజూ కొత్త కొత్త ఫాలోవర్స్‌ను పొందుతోంది. మరి ఆమె కెరీర్ కు ఈ క్రేజ్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.