కిల్లర్ లుక్ లో పాండే బ్యూటీ పేంపరింగ్!
`అర్జున్ రెడ్డి` హిట్ తో తారాజువ్వలా దూసుకొచ్చిన షాలినీ పాండే జాడిప్పుడు టాలీవుడ్ లో ఎక్కడా కనిపించని సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 Aug 2024 5:50 PM GMT`అర్జున్ రెడ్డి` హిట్ తో తారాజువ్వలా దూసుకొచ్చిన షాలినీ పాండే జాడిప్పుడు టాలీవుడ్ లో ఎక్కడా కనిపించని సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం నిశబ్దం సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ అమ్మడు పత్తా లేదు. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది గానీ అక్కడా సరైన సక్సెస్ రాలేదు. ఇటీవలే రెండేళ్ల గ్యాప్ అనంతరం `మహారాజ్` సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది లేదు.
కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. కానీ స్టార్ కిడ్స్ వేవ్ కారణంగానూ కొన్ని అవకాశాలు కోల్పోతుంది. ఆ మధ్య షాలిని పాండే నటించాల్సిన సినిమా అన్యన్యా పాండే తన్నుకుపోయింది. ట్యాలెంట్ ఉన్నా? ఆ రకంగా కొన్ని అవకాశాలు కోల్పోతుందనే ప్రచారం ఉంది. ఇక అమ్మడి సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా ఇన్ స్టాలో మాత్రం కుర్రాళ్లను హీటెక్కిస్తుంది.
హాట్ ఫోటోలతో సెగలు పుట్టిస్తుంది. డిజైనర్ దుస్తుల్లో నాకెవ్వరూ సాటి అంటూ పోటీ పడుతుంది. తాజాగా సొగసరి మరో న్యూ ఫోటోతో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ కలర్ వింటర్ కోట్ లో దర్శన మిచ్చింది. అమ్మడు స్టైలిష్ గా దిగిన ఓ సెల్పీని పోస్ట్ చేసింది. ముఖానికి లైట్ మ్యాకప్.. హెయిర్ స్టైల్.. కిల్లర్ లుక్ ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
షాలినీ పాండే అభిమానులు లుక్ పై ఎవరి స్టైల్లో వారు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. లుక్స్ గార్జీయస్, బ్యూటీఫుల్, క్యూట్ బేబి అంటూ పొగిడేస్తున్నారు. ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ `అర్జున్ రెడ్డి`లో బేబి అని పిలవడాన్ని చాలా కాలానికి అభిమానులు గుర్తు చేసారు. ఇలా అమ్మడు ఇన్ స్టాలో అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది.