Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్.. ఒక్కసారిగా హీటెక్కించిందిగా!

నేచురల్ స్టార్ నాని పైసా సినిమా హీరోయిన్ గుర్తుందా? అదేనండీ సిద్ధికా శర్మ.

By:  Tupaki Desk   |   25 Aug 2024 8:30 PM GMT
నాని హీరోయిన్.. ఒక్కసారిగా హీటెక్కించిందిగా!
X

నేచురల్ స్టార్ నాని పైసా సినిమా హీరోయిన్ గుర్తుందా? అదేనండీ సిద్ధికా శర్మ. ఆ మూవీలో అందం, అభినయంతో అలరించిన ముద్దుగుమ్మ.. అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. ఉత్తరాఖండ్ కు చెందిన అమ్మడు.. మూవీల్లోకి రాకముందు మోడల్ గా రాణించింది. మోడలింగ్ చేస్తున్న సమయంలో టాలీవుడ్ లో ఛాన్స్ దక్కించుకుంది. ఆల్ ది బెస్ట్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.


జేడీ చక్రవర్తి, శ్రీకాంత్ లీడ్ రోల్స్ నటించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత గాలి కుర్రోళ్లు మూవీలో యాక్ట్ చేసింది. ఫస్ట్ సినిమాలో తన పేరును లక్కీ శర్మగా తెలిపిన బ్యూటీ.. రెండో మూవీ కోసం షెఫాలీ శర్మ అని పెట్టుకుంది. కానీ ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా ఎవరికీ తెలియదు. అక్కడికి రెండేళ్ల తర్వాత నాని పైసా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో మంచి రోల్ లో కనిపించింది.

పైసా మూవీలో బాగా డబ్బున్న వ్యక్తి కుమార్తెగా కనిపించి తన యాక్టింగ్ తో మెప్పించింది. ఆ సమయంలో తన ఒరిజినల్ నేమ్ ను బయటపెట్టింది. సిద్ధిక బాగానే నటించినా.. సినిమా అనుకున్నట్లు హిట్ అవ్వలేదు. దీంతో ఒక్కసారిగా మాయమైంది అమ్మడు. సుమారు ఐదేళ్లపాటు ఎక్కడా కనిపించలేదు. ప్రేమ పరిచయం మూవీతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. అలా ఒక్క హిట్ అందుకోకుండానే ఆమె టాలీవుడ్ కెరీర్ ముగించింది.

అయితే తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది అమ్మడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటోంది. రకరకాల ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అలరిస్తుంటోంది. తన అందాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంటూ ఉంటోంది. అలా తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటోంది. గ్లామర్ డోస్ పెంచేసి ఫిదా చేస్తుంటోంది. తాజాగా సిద్ధికా శర్మ నయా పిక్స్ ను తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది.

వైట్ ప్యాంట్ అండ్ బ్లూ కలర్ జాకెట్ వేసుకున్న అమ్మడు ఓ రేంజ్ లో ఉంది. హీట్ పుట్టించే అందాలతో ఒక్కసారిగా సెగలు పుట్టించింది. హెయిర్ లీవ్ చేసుకుని తన లుక్ తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమ్మడు ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పిక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లైకుల వర్షం కురిపిస్తూ కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. సో బ్యూటిఫుల్ అంటూ కొనియాడుతున్నారు.