Begin typing your search above and press return to search.

ఆగస్టు బాక్సాఫీస్: హిట్టు కొట్టకపోతే కష్టమేనా?

సినీ ప్రియుల కోసం ఆగస్టులో అనేక సినిమాలు రాబోతున్నాయి. ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నా ప్రధానంగా 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'సరిపోదా శనివారం' చిత్రాలపైనే అందరి దృష్టి వుంది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 11:59 AM GMT
ఆగస్టు బాక్సాఫీస్: హిట్టు కొట్టకపోతే కష్టమేనా?
X

'శివం భజే' సినిమాతో ఆగస్టు బాక్సాఫీస్ ప్రారంభమైంది. అశ్విని బాబు నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఈరోజు గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఆడియన్స్ నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ' సినిమా రేపు శుక్రవారం రిలీజ్ కానుంది. టెడ్డీబేర్‌ చుట్టూ నడిచే కథాంశంతో తెరకెక్కిన ఈ యాక్షన్ ప్యాక్డ్ కామెడీ ఎంటర్టైనర్ ప్రమోషనల్ కంటెంట్ తో జనాల్లో ఆసక్తిని కలిగించింది. రాజ్ తరుణ్ 'తిరగబడరా సామీ'.. వరుణ్ సందేశ్ 'విరాజి' సినిమాలు కూడా రేపే విడుదల కానున్నాయి.

కె.విజయ్ భాస్కర్ కొడుకు నటించిన 'ఉషా పరిణయం'.. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన తమిళ డబ్బింగ్ సినిమా 'తుఫాన్' తో పాటుగా 'అలనాటి రామచంద్రుడు', 'లారి చాప్టర్ 1', 'యావరేజ్ స్టూడెంట్ నాని' లాంటి మరికొన్ని సినిమాలు ఆగస్టు 2న రిలీజ్ అవుతున్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రాళ్లు' చిత్రం ఆగస్టు 9న రాబోతోంది. ఇప్పటికైతే రెండో వారంలో ఈ ఒక్క సినిమానే షెడ్యూల్ చేయబడింది. మూడో వారంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతోంది.

పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఆగస్టు 15న రానుంది. అదే రోజున రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ రిలీజ్ కానుంది. వీటితో పాటుగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న 'ఆయ్'.. పా. రజింత్, విక్రమ్ కలిసి చేస్తున్న 'తంగలాన్' సినిమాలు కూడా వస్తున్నాయి. నాలుగో వారంలో రావు రమేష్ 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' సినిమా విడుదల కానుంది. చివర్లో ఆగస్టు 29న నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న 'సరిపోదా శనివారం' మూవీ థియేటర్లలోకి రానుంది.

సినీ ప్రియుల కోసం ఆగస్టులో అనేక సినిమాలు రాబోతున్నాయి. ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నా ప్రధానంగా 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'సరిపోదా శనివారం' చిత్రాలపైనే అందరి దృష్టి వుంది. అంచనాలు కూడా వీటిపైనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, లైగర్ తో ఫ్లాప్ అందుకున్న పూరీకి, రెండు బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న రామ్ కు, హ్యాట్రిక్ ఫ్లాప్స్ రుచి చూసిన రవితేజకు, గద్దలకొండ గణేశ్ తర్వాత మరో సినిమా చెయ్యని హరీశ్ కు ఈ ఇండిపెండెన్స్ డే కీలకంగా మారింది. కచ్ఛితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలన్నీ ఎలా పెర్ఫామ్ చేస్తాయో చూడాలి.