Begin typing your search above and press return to search.

టాలీవుడ్.. అర్జెంట్ గా ఓ హిట్ కావాలి

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో అత్యంత డ్రైగా తక్కువ సక్సెస్ రేట్ అంటే ఈ ఏడాది ప్రథమార్ధంలోనే వచ్చిందని చెప్పాలి

By:  Tupaki Desk   |   29 May 2024 3:59 AM GMT
టాలీవుడ్.. అర్జెంట్ గా ఓ హిట్ కావాలి
X

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో అత్యంత డ్రైగా తక్కువ సక్సెస్ రేట్ అంటే ఈ ఏడాది ప్రథమార్ధంలోనే వచ్చిందని చెప్పాలి. ప్రతి నెల తెలుగులో 20-30 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో గట్టిగా చెప్పుకుంటే హనుమాన్, నా సామి రంగా, టిల్లు స్క్వేర్, ఓం భీమ్ బుష్, గామి మాత్రమే కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటి వరకు 100+ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ హిట్ మూవీస్ లో కూడా భారీగా లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలంటే హనుమాన్, టిల్లు స్క్వేర్ మాత్రమే. టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యి రెండు నెలలకి పైగా అయ్యింది. ఈ 60 రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ కూడా లేదు. కొన్ని బజ్ ఉన్న సినిమాలు థియేటర్స్ లోకి వచ్చిన ప్రేక్షకాదరణ పొందడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. ఇంత దారుణమైన ఫలితాలు టాలీవుడ్ గత కొన్నేళ్ల కాలంలో ఎప్పుడూ చూడలేదని సినీ విశ్లేషకులు అంటున్న మాట.

ఇదిలా ఉంటే ఈ నెల ఆఖరులో మూడు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. వీటిలో విశ్వక్ సేన్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీపైన కొద్దిగా బజ్ ఉంది. కచ్చితంగా ఈ మూవీ హిట్ బొమ్మగా మారే అవకాశం ఉందని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది. మూవీ ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. పబ్లిక్ లో కూడా సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. సాలిడ్ ఓపెనింగ్స్ అయితే తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇక మూవీ రిజల్ట్ కంటెంట్ బట్టి ఉంటుంది.

కార్తికేయ హీరోగా తెరకెక్కిన భజే వాయువేగం మూవీ కూడా మే 31న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాని యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో కార్తికేయ చేశాడు. ప్రమోషన్స్ చేస్తోన్న పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. మూవీ రిలీజ్ తర్వాత మౌత్ టాక్ తో పబ్లిక్ లోకి వెళ్తుందేమో చూడాలి అలాగే ఆనంద్ దేవరకొండ నుంచి గంగం గణేశా మూవీ వస్తోంది. యాక్షన్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ మూవీపైన పెద్దగా పబ్లిక్ అటెన్షన్ లేదు.

ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేస్తున్నారు. రష్మిక ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చి విషెష్ చెప్పింది. ఈ మూడు చిత్రాలలో కనీసం ఒక్క సక్సెస్ అయిన వస్తే బాగుంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని 60 రోజులకి పైగా అయిపోవడంతో ఈ మే నెలని విక్టరీతో ముగిస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.