Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ 2024: ఇక వారిద్దరే చూస్కోవాలి..

డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా కల్కి మూవీ నిలిచింది.

By:  Tupaki Desk   |   21 July 2024 5:16 AM GMT
బాక్సాఫీస్ 2024: ఇక వారిద్దరే చూస్కోవాలి..
X

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ కి ‘కల్కి 2898ఏడీ’ రూపంలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ లభించింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రంగా కల్కి మూవీ నిలవడం విశేషం. వరల్డ్ వైడ్ గా ఇప్పటికి డీసెంట్ వసూళ్లని కల్కి మూవీ సొంతం చేసుకుంటుంది. దీనిని బట్టి పబ్లిక్ ఎంత యునానమస్ గా ఈ సినిమాకి సక్సెస్ ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా కల్కి మూవీ నిలిచింది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితా చూసుకుంటే దర్శకుడిగా మొదటి స్థానంలో రాజమౌళి ఉన్నారు. ‘బాహుబలి 1’తో 500+ కోట్ల కలెక్షన్స్ ని సాధించిన రాజమౌళి ‘బాహుబలి 2’తో 1500+ కోట్లకి పైగా వసూళ్లని అందుకొని సెన్సేషన్ రికార్డ్ ని క్రియేట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్ మూవీ’ 1200+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించింది. అయితే డార్లింగ్ ప్రభాస్ మాత్రమే 500+ కలెక్షన్స్ ని టాలీవుడ్ లో సాధించిన హీరోగా ఉన్నాడు.

బాహుబలి 1, 2 తర్వాత గత ఏడాది ‘సలార్’ సినిమా 700 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఈ ఏడాది ‘కల్కి 2898ఏడీ’ మూవీ 1000+ కోట్లకి పైగా వసూళ్లని అందుకుంది. నెక్స్ట్ ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ కి కల్కి రేంజ్ కాకపోయిన ఆ స్థాయిలో సక్సెస్ ఇవ్వగలిగే సత్తా కేవలం రెండు సినిమాలకి మాత్రమే ఉందని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

కచ్చితంగా 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ కి దేవర అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీని తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ని సాధించడానికి ఎక్కువ స్కోప్ ఉందనే ప్రచారం నడుస్తోంది. సూపర్ హిట్ మూవీ ‘పుష్ప’కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 6న థియేటర్స్ లోకి వస్తోంది. మూవీపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

కచ్చితంగా ‘పుష్ప ది రూల్’ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకుంటాడని భావిస్తున్నారు. ఈ రెండు సినిమా 2024లో టాలీవుడ్ బాక్సాఫీస్ కి స్ట్రాంగ్ పిల్లర్స్ గా నెక్స్ట్ కనబడుతున్నాయి. మరి వీటిలో ఏది ప్రేక్షకులని ఎక్కువ మెప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవి కాకుండా టాలీవుడ్ బాక్సాఫీస్ నుంచి మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ లైన్ లో ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.