Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ క్లాష్: సినిమాలు ఎక్కువ.. బజ్ తక్కువ

ఈ మధ్యకాలంలో సినిమాల రిలీజ్ అనేది నిర్మాతలకి పెద్ద తలనొప్పిగా మారుతోంది

By:  Tupaki Desk   |   31 July 2024 5:34 AM GMT
బాక్సాఫీస్ క్లాష్: సినిమాలు ఎక్కువ.. బజ్ తక్కువ
X

ఈ మధ్యకాలంలో సినిమాల రిలీజ్ అనేది నిర్మాతలకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. స్టార్ హీరోలు అందరూ ప్రైమ్ డేట్స్ ని ముందే లాక్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలకి పోటీగా చిన్న సినిమాలు రిలీజ్ చేస్తే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కష్టం అవుతుంది. పబ్లిక్ అటెన్షన్ అంతా కూడా స్టార్ హీరోలపైనే ఉంటుంది. దీంతో ఆ ప్రైమ్ డేట్స్ లో చిన్న సినిమాలు రిలీజ్ చేసే సాహసం చేయడం లేదు.

అలా అని మిగిలిన డేట్స్ చూజ్ చేసుకుంటే పోటీగా చాలా సినిమాలు కాంపిటేషన్ లోకి వస్తున్నాయి. వీటిలో ఒకటి రెండు సినిమాలు తప్ప పబ్లిక్ ని ఎట్రాక్ట్ చేసే మూవీస్ తక్కువగానే ఉంటున్నాయి. చిన్న హీరోల సినిమాలు కావడంతో మౌత్ టాక్ మీదనే ఆయా చిత్రాల సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆగష్టు 2న కూడా చిన్న సినిమాల మధ్య హెవీ ఫైట్ జరగబోతోంది. ఒకే రోజు ఏకంగా 10 సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి.

వీటిలో 8 సినిమాలు తెలుగు మూవీస్ కాగా 2 హిందీ సినిమాలు ఉన్నాయి. ఆగష్టు 1న అశ్విన్ బాబు శివంభజే మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మైథాలజీ ఎలిమెంట్ కనెక్ట్ చేసిన సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఆగష్టు 2న రిలీజ్ కాబోయే సినిమాలలో కొద్దిగా ఫేమ్ ఉన్న చిత్రం అంటే అల్లు శిరీష్ బడ్డీ. స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. అయితే పెద్దగా బజ్ లేదు. రాజ్ తరుణ్ తిరబడర సామి మూవీ అదే రోజు రిలీజ్ అవుతోంది.

రెండు వారాల గ్యాప్ లో రాజ్ తరుణ్ నుంచి వస్తోన్న రెండో సినిమా ఇది. రాజ్ తరుణ్ వ్యక్తిగత వివాదం కారణంగా సినిమాపై కొంత బజ్ క్రియేట్ అయ్యింది. ఏఎస్ రవికుమార్ చౌదరి గతంలో మంచి సక్సెస్ లు అందుకున్నారు. అందుకే ఈ సినిమా రాజ్ తరుణ్ ఫేట్ మార్చే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. వరుణ్ సందేష్ నుంచి విరాజ్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. ఒకప్పటి సక్సెస్ ఫుల్ దర్శకుడు విజయ్ భాస్కర్ తన కొడుకు శ్రీ కమల్ తో చేసిన ఉషా పరిణయం కూడా ప్రేక్షకుల ముందుకొస్తోంది.