Begin typing your search above and press return to search.

ఈ వారం బాక్సాఫీస్ క్లాష్.. అందరి ఫోకస్ ఆ సినిమాపైనే..

ప్రతివారం ప్రేక్షకుల ముందుకి వచ్చే సినిమాలలో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   22 Aug 2024 10:18 AM GMT
ఈ వారం బాక్సాఫీస్ క్లాష్.. అందరి ఫోకస్ ఆ సినిమాపైనే..
X

ప్రతివారం ప్రేక్షకుల ముందుకి వచ్చే సినిమాలలో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నాయి. గత వారం థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలలో తెలుగు వరకు చూసుకుంటే ఆయ్ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది. అలాగే హిందీలో స్త్రీ2 సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. తమిళం నుంచి వచ్చిన తంగలాన్ మూవీ కూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

మిగిలిన సినిమాలు ఏవీ కూడా ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. ఈ వారం తెలుగులో ప్రేక్షకుల ముందుకి కొన్ని ఇంటరెస్టింగ్ సినిమాలు అయితే వస్తున్నాయి. భారీ బడ్జెట్ మూవీస్ అయితే రావడం లేదు. కాని కాస్తా బజ్ ఉన్న మూవీస్ థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాయి. వాటిలో మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఒకటి. రావు రమేష్ లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కింది. సుకుమార్ వైఫ్ తబిత ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్, సుకుమార్ చీఫ్ గెస్ట్ లుగా రావడంతో ఈ చిత్రంపై హైప్ పెరిగింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక మిగతా సినిమాలపై అంతగా బజ్ లేదు. కనీసం వస్తున్నట్లు కూడా ఎవరికి తెలియదు. అందరి ఫోకస్ అయితే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం పైనే ఉంది. ఆగష్టు 23న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.

మరోవైపు టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బండి సరోజ్ కుమార్ నుంచి వస్తోన్న పరాక్రమం ఆగష్టు 22న రిలీజ్ అయ్యింది. అలాగే రేవు అనే చిన్న సినిమా కూడా శుక్రవారం రిలీజ్ కి సిద్ధమైంది. తమిళంలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న డిమోంటే కాలనీ 2 తెలుగు వెర్షన్ ఆగష్టు 23న రిలీజ్ అవుతోంది. హర్రర్ కామెడీ ఇష్టపడేవారికి ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే భ్రమవారం, యజ్ఞ, వెడ్డింగ్ డైరీస్ సినిమాలు శుక్రవారం రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు అన్ని కూడా పెద్దగా స్టార్ క్యాస్టింగ్ లేకుండా కంటెంట్ ని నమ్ముకొని ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

గత కొంతకాలంగా కథాబలం ఉన్న సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలలో కూడా ఏదో ఒకటి ప్రేక్షకులని మెప్పిస్తుందని భావిస్తున్నారు. ఆగష్టు 29న నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో 23న రిలీజ్ అయ్యే సినిమాలు ఈ వారంరోజుల సమయాన్ని మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. వీటిలో మారుతీనగర్ సుబ్రహ్మణ్యం పైన కాస్త ఎక్కువ అంచనాలు ఉన్నాయి. మరి ఆ సినిమా ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.