కల్కి ఊపిరిపోస్తాడా?
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గత కొన్ని నెలలుగా చాలా వరస్ట్ ఫేజ్ ను చూస్తోంది
By: Tupaki Desk | 24 Jun 2024 5:16 PM GMTఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ గత కొన్ని నెలలుగా చాలా వరస్ట్ ఫేజ్ ను చూస్తోంది. కరోనా పాండమిక్ టైంలో సినీ ఇండస్ట్రీ ఎలాంటి ఇబ్బందులు పడిందో, అంతకంటే దారుణమైన స్థితిలో ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఉంది. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ కు కళ తీసుకొచ్చాయి కానీ, ఆ తర్వాత అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాలు రాలేదు. గడిచిన ఐదు నెలల్లో సరైన సినిమా లేక ధియేటర్లు బోసిపోయాయి. ఓవైపు మలయాళం నుంచి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు వస్తుంటే, తెలుగులో మాత్రం పెద్ద సినిమాలు రిలీజ్ చేసుకోడానికే వెనకడుగు వెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐపీఎల్ క్రికెట్, ఎలక్షన్స్, ఎండల తీవ్రతతో జనాలు సినీ వినోదం కోసం థియేటర్లకు రాలేదనేది వాస్తవం. ఈ కారణం చేతనే పెద్ద హీరోలంతా ఈసారి సమ్మర్ సీజన్ లో సినిమాలు రిలీజ్ చెయ్యలేదు. అయితే ధైర్యం చేసి మార్చి నెలాఖరున వచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీ మాత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ, కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు దేన్నీ లెక్క చేయరని నిరూపించింది. కానీ టిల్లుగాడి సినిమా తర్వాత జనాలను రప్పించి, థియేటర్లకు కళ తీసుకొచ్చే ఒక్కటంటే ఒక్క మూవీ కూడా రాలేదు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఫ్యామిలీ స్టార్' లాంటి సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. మధ్యలో కొన్ని మీడియం రేంజ్ మూవీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, జనాలు థియేటర్ల వైపు చూడకపోవడంతో కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోయాయి. ఇక చిన్నా చితకా చిత్రాలైతే, ఎప్పుడొచ్చాయో తెలియకుండానే అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కొన్ని నెలలుగా బోసిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'కల్కి 2898 AD' చిత్రంపైనే అందరూ హోప్స్ పెట్టుకున్నారు. ఇది కనుక హిట్టయితే మళ్ళీ ఎప్పటిలాగే బాక్సాఫీసు గాడిలో పడుతుందని భావిస్తున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ'. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో రూపొందించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పఠానీ, మాళవిక అయ్యర్ లాంటి స్టార్ కాస్టింగ్ ఈ క్రేజీ చిత్రంలో భాగం అయ్యారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దాదాపు నాలుగైదు నెలల తర్వాత థియేటర్లలోకి రాబోతున్న పెద్ద హీరో చిత్రం కావడంతో సినీ అభిమానులతో పాటుగా ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి.
ఇప్పటి వరకూ 'కల్కి 2898 AD' సినిమా నుంచి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ను ఆడియెన్స్ ను ఎగ్జైట్ చేసేలానే ఉంది. థియేటర్ లో సరికొత్త విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ హామీ ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఓవర్ సీస్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ అదరగొడుతున్నాయి.
తెలంగాణాలో అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో, రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ లలో ఐదు షోలు పడబోతున్నాయి. మల్టీపెక్స్ లలో 30 - 42 షోలు ప్రదర్శించబోతున్నారు. ఇన్ని షోలు వేస్తున్నా ఆన్ లైన్ లో టికెట్లు దొరకడం కష్టంగా మారిందంటే, ఈ సినిమాకి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సరైన సినిమా వస్తే, బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉంటుందో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ తో తెలిసిపోతుంది. ఇదంతా చూస్తుంటే 'కల్కి' కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ తో న్యూ రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనా వేయొచ్చు. ఇదే కనుక జరిగితే బోసిపోయిన బాక్సాఫీస్ కు ప్రభాస్ సినిమా మళ్ళీ ఊపిరి పోసినట్లు అవుతుంది.