Begin typing your search above and press return to search.

టాలీవుడ్​..​ మరో వెయ్యి కోట్ల దర్శకుడు లేడా?

మరి జక్కన్న మినహా మిగితా తెలుగు దర్శకులకు ఇంకా అది ఎందుకు సాధ్యం కాలేదో.

By:  Tupaki Desk   |   26 Oct 2023 4:38 PM GMT
టాలీవుడ్​..​ మరో వెయ్యి కోట్ల దర్శకుడు లేడా?
X

ఒకప్పుడు తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కొల్లగొడితే చాలా గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసి.. రూ.1000కోట్ల మార్కెట్​ దాటేలా చేశారు. ఆర్​ఆర్ఆర్​, బాహుబలి 2 లాంటి చిత్రాలతో తెలుగువారు గర్వించదగ్గ ఘట్టం దేశ సినీ చ‌రిత్ర‌లో ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఇక్కడి దాకా కథ బాగానే ఉంది. మరి ఆర్​ఆర్​ఆర్​ తర్వాత టాలీవుడ్​లో ఆ రేంజ్​ వసూళ్లు సాధించిన సినిమా ఏంటి? అంటే సమాధానం దొరకదు.

ఎందుకంటే ఆ రేంజ్ సినిమా ఇప్పటివరకు రాలేదు. రాజమౌళి రూ.1000కోట్ల మార్కెట్​కు​ బాటలు వేసినా.. ఆ తర్వాత ఏ తెలుగు, హీరో, దర్శకుడు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.500కోట్ల గ్రాస్​ వసూళ్లను అందుకోలేదు. సాహో, పుష్ప పాన్ ఇండియా రేంజ్​లో విజయం సాధించినప్పటికీ అవేమి రూ.500కోట్లు అందుకోలేదు.

మరి దీనికి కారణం ఏంటి? అంటే.. జక్కన్న మినహా ఇతర ఏ తెలుగు దర్శకుడు కూడా ఆ దిశగా అడుగులు వేయడానికి గట్టిగా ప్రయత్నించట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుకుమార్ పుష్పతో మంచి ప్రయత్నమే చేసినప్పటికీ.. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్​లో భారీ హిట్ అవుతుందని తాను కూడా ఊహించలేదని చెప్పారు. అంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్​ అవ్వాలని ఆయన ఎఫర్ట్​ పెట్టి తీయలేదని అని అర్థమైంది.

ఓ మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే చాలని మాత్రమే ఆశించారు. ప్రస్తుతం పుష్ప 2 కోసం మాత్రం ఆ ఎఫర్ట్​తోనే చేస్తున్నారు. కానీ దీని రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇక త్రివిక్రమ్ సినిమా కనీసం ఇప్పటివరకు పాన్ ఇండియా రేంజ్​లో కూడా రాలేదు. ఇతర దర్శకులది ఇదే సంగతి.

కానీ పక్క భాషల దర్శకుల విషయానికొస్తే.. కన్నడలో ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీయఫ్​తో, కోలీవుడ్​లో అట్లీ జవాన్​తో రూ.1000కోట్ల మార్కెట్​ను అందుకున్నారు. మరి జక్కన్న మినహా మిగితా తెలుగు దర్శకులకు ఇంకా అది ఎందుకు సాధ్యం కాలేదో.. ఫైనల్​గా మళ్లీ తెలుగులో తన రికార్డ్​ తానే బ్రేక్​ చేసుకునేందుకు రాజమౌళి సిద్ధం అవుతున్నారు. మహేశ్​బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు.