Begin typing your search above and press return to search.

బుచ్చిబాబుని స‌ర్ ప్రైజ్ చేసిన రెహ‌మాన్!

యంగ్ డైరెక్ట‌ర్ బుచ్చి బాబుని ఏ.ఆర్ రెహ‌మాన్ స‌ర్ ప్రైజ్ చేసారా? ఆ స‌ర్ ప్రైజ్ తో రామ్ చ‌ర‌ణ్ కూడా హ్యీపీగా ఫీల‌య్యారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 Sep 2023 5:32 AM GMT
బుచ్చిబాబుని స‌ర్ ప్రైజ్ చేసిన రెహ‌మాన్!
X

యంగ్ డైరెక్ట‌ర్ బుచ్చి బాబుని ఏ.ఆర్ రెహ‌మాన్ స‌ర్ ప్రైజ్ చేసారా? ఆ స‌ర్ ప్రైజ్ తో రామ్ చ‌ర‌ణ్ కూడా హ్యీపీగా ఫీల‌య్యారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఈ ముగ్గురి కాంబినేష‌న్ లో # ఆర్ సీ 16 లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. `గేమ్ ఛేంజ‌ర్` పూర్తి కాగానే బుచ్చిబాబు-చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది. దీనిలో భాగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. చ‌ర‌ణ్ కి జోడీగా ఏహీరోయిన్ ని ఎంపిక చేయాలి అన్న అంశంపై ప్ర‌ధానంగా దర్శ‌కుడు డిస్క‌ష‌న్స్ సాగిస్తున్నాడు.

ఈనేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ సినిమాలో మొద‌టి పాట కంపోజింగ్ ని రెహ‌మాన్ పూర్తి చేసారుట‌. ఆ పాట బుచ్చిబాబు ..చ‌ర‌ణ్ విని ఒకే చేయ‌డం జ‌రిగిందిట‌. పాట చాలా బాగుంద‌ని టాక్ వినిపిస్తుంది. రెహ‌మాన్ మార్క్ సాంగ్ గా మాట్లాడుకుంటున్నారు. మిగ‌తా పాట‌ల‌కు సంబంధించిన ప‌నులు కూడా రెహ‌మాన్ వేగంగానే పూర్తిచేసే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇది నిజంగా స‌ర్ ప్రైజ్ అనే అనాలి. రెహ‌మాన్ తో వ‌ర్క్ మోడ్ ఎలా ఉంటుందో ? ఆయ‌న‌తో ప‌నిచేసిన వారికి బాగా తెలుసు.

ఓ ర‌కంగా ఆయ‌న‌పై చాలా పెద్ద విమ‌ర్శ‌కూడా ఉంది. తొంద‌ర‌గా ట్యూన్స్ ఇవ్వ‌డ‌ని..పాట‌లు కంపోజ్ చేయ‌డ‌ని....మ‌నిషి స‌హనాన్నే ప‌రీక్షిస్తాడ‌ని వ‌ర్మ లాంటి వారే మొత్తుకున్న సంద‌ర్భం ఉంది. రెహ‌మాన్ ప‌ర్పెక్ట్ గా ప‌నిచేసేది కేవ‌లం శంక‌ర్..మ‌ణిర‌త్నం లాంటి కొంత మందితోనేన‌ని! చెబుతుంటారు. మిగ‌తా వారి విష‌యంలో రెహ‌మాన్ స‌హ‌నానికే ప‌రీక్ష లాంటోడ‌ని విమ‌ర్శ వినిపిస్తూనే ఉంటుంది. అయితే చ‌ర‌ణ్ 16వ సినిమా విష‌యంలో మాత్రం రెహ‌మాన్ చాలా సీరియ‌స్ గానే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఏమాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కుండా ఇన్ టైమ్ లోనే ట్యూన్స్ ..పాట‌లు కంపోజ్ చేసి త‌న పని పూర్తిచేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌న్నివేశం క‌నిపిస్తుంది. సినిమా ప్రారంభానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. కానీ రెహ‌మాన్ ఆ స‌మ‌యాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవ‌డం లేదు. అందుకే చ‌క‌చ‌కా ట్యూన్లు కంపోజ్ చేసే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రెహ‌మాన్ లో ఈ మార్పు మంచిదే.