టాలీవుడ్ కు ఎన్నికల దెబ్బ.. కల్కి తరువాత కూడా కష్టమే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సైన్స్ డిస్టోపియన్ సినిమా విడుదలైన.. నాలుగు రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
By: Tupaki Desk | 16 March 2024 12:17 PM GMTదేశంలో ఎన్నికల సైరన్ మోగిపోయింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుండగా.. చివరి విడత జూన్ 1న తేదీన జరగనుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన ఓట్ల జాతర జరగనుంది. మొత్తం అన్ని విడతల ఫలితాలు.. జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి.
ఈసారి కూడా ఎన్నికలు.. సమ్మర్ లోనే జరుగుతున్నాయి. అయితే సాధారణంగా సినిమాలు కూడా సంక్రాంతి తర్వాత ఎక్కువగా వేసవి కానుకగానే థియేటర్లలోకి వస్తుంటాయి. విద్యార్థులకు సెలవులు కావడంతో అప్పుడే తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. ఇప్పటికే విద్యార్థులంతా ఎగ్జామ్స్ లో బిజీగా ఉండగా.. మరికొద్ది రోజుల్లో ఫ్రీ అవ్వనున్నారు.
అయితే గామి మూవీతో వేసవి సినిమా సీజన్ స్టార్ట్ కాగా.. ఆ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇక విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 12న విక్రమ్ తంగలాన్ విడుదల కానుంది. అయితే ఏప్రిల్ 19వ తేదీన ఎన్నికల తొలి విడత ప్రారంభం కానుండగా.. అంతకుముందే సుహాస్ శ్రీరంగనీతులు కూడా రిలీజ్ అయిపోతుంది.
ఇదంతా బాగానే ఉన్నా.. ఏప్రిల్ 19వ తేదీన ఎన్నికల జాతర మొదలయ్యాక కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రానున్నారు. ఆయన నటిస్తున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం.. ఏప్రిల్ 26న రిలీజ్ కానుంది. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ కూడా అదే వారంలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి మే 9వ తేదీన థియేటర్లలోకి రావాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సైన్స్ డిస్టోపియన్ సినిమా విడుదలైన.. నాలుగు రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి సినిమా ఈ డేట్ కు వచ్చే అవకాశం లేదు. ముందుగానే సినిమా వాయిదా పై అనుమానాలు వచ్చాయి. ఇక ఫైనల్ ఎన్నికల డేట్ తో మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. మేకర్స్ ఏమాత్రం రిస్క్ చేయరని చెప్పవచ్చు.
ఇక జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరిగిన తర్వాత రామ్ డబుల్ ఇస్మార్ట్, అల్లు అర్జున్ పుష్ప-2, నాని సరిపోదా శనివారం, పవన్ ఓజీ, ఎన్టీఆర్ దేవర, నాగ చైతన్య తండేల్ చిత్రాలు వరుసగా సందడి చేయనున్నాయి. అయితే ఎన్నికల సీజన్ లో రిలీజయ్యే సినిమాల్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది కల్కి కోసమే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఎన్నికల వల్ల వాయిదా పడుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ వాయిదా పడితే మళ్లీ నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆగస్టు టు అక్టోబర్ లో ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి. మరి కల్కి చిత్రంతోపాటు మిగతా సినిమాల విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.