Begin typing your search above and press return to search.

సంక్రాతి రేసులో ఉన్న సినిమాలు… షూటింగ్ ఏ దశలో అంటే?

వచ్చే ఏడాది సంక్రాతికి ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇప్పటికే సుమారు కన్ఫర్మ్ అయిపోయాయి

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:13 AM GMT
సంక్రాతి రేసులో ఉన్న సినిమాలు… షూటింగ్ ఏ దశలో అంటే?
X

తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఏడాది వందల సంఖ్యలో మూవీస్ తెరకెక్కుతూ ఉంటాయి. వాటిలో కొన్ని సినిమాల మీద మంచి బజ్ నడుస్తూ ఉంటుంది. అలాగే సంక్రాంతి రేసులో చాలా సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. వచ్చే ఏడాది సంక్రాతికి ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇప్పటికే సుమారు కన్ఫర్మ్ అయిపోయాయి. ఈ సినిమాలకి సంబందించిన ప్రస్తుతం షూటింట్ వివిధ దశలలో ఉన్నాయి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో సిద్ధం అవుతోన్న ఈ మూవీ బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో వేగంగా పూర్తి చేయాలని మతాల మాంత్రికుడు అనుకుంటున్నారు. ఇప్పటి వరకు 25 శాతం షూటింగ్ మాత్రమే గుంటూరు కారం కంప్లీట్ అయ్యిందంట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా రెండేళ్ల క్రితమే ఎనౌన్స్ చేసిన పవర్ స్టార్ డేట్స్ ఈ ఏడాదిలో దొరకడంతో మొత్తానికి సెట్స్ పైకి వెళ్ళింది. హరీష్ శంకర్ పెర్ఫెక్ట్ షెడ్యూల్ తో 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. తరువాత గ్యాప్ ఇచ్చి వారాహి యాత్రపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. మూడో దశ యాత్ర తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట.

కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో ఈగల్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. పీరియాడికల్ జోనర్ లో యాక్షన్ ప్యాక్డ్ మూవీగా దీనిని సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీ 85 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్ హీరో మూవీ హనుమాన్ 90 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

తేజ సజ్జా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ 20 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట.