ఓటీటీ ని టాలీవుడ్ సీరియస్ గా తీసుకోలేదా!
మరి అలాంటి వెబ్ సిరీస్ గానీ...కంటెంట్ బేస్డ్ సినిమా గానీ తెలుగు నుంచి ఆశించిన విధంగా లేవనే చెప్పాలి
By: Tupaki Desk | 8 Aug 2023 6:17 AM GMTమార్కెట్ లో ఓటీటీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. సినిమాల కంటే ఓటీటీ కంటెంట్ కి ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా కనిపిస్తుంది. అన్నీ భాషల్లోనూ ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన అన్ని రకాల కంటెంట్ ఓటీటీలో దొరుకుతుంది. ఈ రకమైన వెసులు బాటు సినిమాలపై కాస్తా..కూస్తో ప్రభావం చూపిస్తుందన్నది వాస్తవం. ఇక ఓటీటీలో బాగా సక్సెస్ అయిన పరిశ్రమ ఏది అంటే బాలీవుడ్ కనిపిస్తుంది. బాలీవుడ్ ఓటీటీ తరహాలో టాలీవుడ్ సహా ఏదీ సక్సెస్ అయినట్లు కనిపించలేదు.
బాలీవుడ్ కంటెంట్ కి ప్రేక్షకులు తొలి నుంచి పెద్ద పీట వేస్తున్నారు. అక్కడనుంత సక్సెస్ టాలీవుడ్ లో కనిపించలేదు. 'సేక్రేడ్ గేమ్స్'.. 'ది ఫ్యామిలీ మ్యాన్'..' సీక్రెట్ ఆప్స్'..' స్కామ్ 1993'.. 'స్కూప్'..' మేడ్ ఇన్ హెవెన్'..' మీర్జాపూర్' లాంటి కంటెంట్ ఓటీటీని శాషించిందనే చెప్పాలి.ఇంకా మరెన్నో వెబ్ సిరీస్ లు హిందీ ఓటీటీలో చక్రం తిప్పుతున్నాయి. బాలీవుడ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయా? అంటే అక్కడ ఓటీటీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అద్దం పడుతుంది.
మరి అలాంటి వెబ్ సిరీస్ గానీ...కంటెంట్ బేస్డ్ సినిమా గానీ తెలుగు నుంచి ఆశించిన విధంగా లేవనే చెప్పాలి. టాలీవుడ్ బెస్ట్ ఓ టీటీ సిరీస్ ఇది అని చెప్పుకేనే రేంజ్ లో ఏది లేదు. క్రిష్.. నాగ్ అశ్విన్ ..దేవకట్టా..సహా మరికొంత మంది ఓటీటీ లో కొన్ని రకాల ప్రయత్నాలు చేసారు కానీ సక్సెస్ అవ్వలేదు. ఓటీటీలో అదిరిపోయే తెలుగు కంటెంట్ ఏదైనా ఉందా? అంటే ఒక్కటి కూడా లేదన చెప్పాలి. దీంతో ఓటీటీలో ఎక్కువగా రీమేక్ లపైనా ఆధారపడుతున్నాయి. ఆహా టీవీఎఫ్ రూపొందించిన హిందీ యూట్యూబ్ కంటెంట్‌ని దిగుమతి చేస్తోంది.
హాట్‌స్టార్ వంటి అగ్రశ్రేణి ప్లేయర్‌లు కూడా రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ కూడా చాలా అంతర్జాతీయ వెబ్ సిరీస్‌లను హిందీలోకి రీమేక్ చేస్తోంది. ఇక్కడా వాళ్లు సక్సెస్ అవుతున్నారు. యూనిక్ కంటెంట్ ని తెలివిగా డంప్ చేసి సక్సెస్ అందుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని టాలీవుడ్ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నేడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లో ఫేమస్ అవుతుంది.
'బాహుబలి'.. 'మహానటి'..'ఆర్ ఆర్ ఆర్' ..'కేజీఎఫ్' లాంటి సినిమాలు దక్షిణాది చిత్ర పరిశ్రమకి..తెలుగు సినీ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. నాటు నాటుకి ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ విషయంలో బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుంది. గొప్ప దర్శకనిర్మాతలు..సాంకేతిక నిపుణులు టాలీవుడ్ లో ఉన్నారు. ఇన్నోవేటివ్ గా సినిమాలు చేసే క్రియేటివ్ పీపూల్స్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఓటీటీ కంటెంట్ పై దృష్టి పెడితే ఎన్నో అద్భుతాలు చేయడానికి ఆస్కారం ఉంది.