Begin typing your search above and press return to search.

హిట్ కంటే ప్లాప్ కే పెద్ద పీట వేసామా ?

ఇందులో స్టార్ హీరోలేమి మిన‌హాయింపు కాదు. టైర్ వ‌న్ నుంచి టైర్ -3 వ‌ర‌కూ హీరోలంతా శూన్య జాబితాలో ఉన్నారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 6:12 AM GMT
హిట్ కంటే ప్లాప్ కే పెద్ద పీట వేసామా ?
X

గ‌డిచిన ఎనిమిది నెలల కాలంలో బ్లాక‌బ‌స్ట‌ర్లు ఎలా ఉన్నాయో! డిజాస్ట‌ర్లు కూడా అలాగే న‌మోద‌య్యాయి. 'దసరా', 'విరూపాక్ష', 'బలగం', 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి'..'ధ‌మాకా' లాంటి హిట్లు భారీ వ‌సూళ్లు సాధిస్తే రెండు..మూడు రోజుల‌కే థియేట‌ర్ నుంచి నిష్క్ర‌మించిన సినిమాల జాబితా కూడా చాలా పెద్ద‌దే. భారీ అంచ‌నాల మధ్య వ‌చ్చిన ఆ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అత్యంత దారుణ‌మైన ఫ‌లితాలు సాధించాయి.

ఇందులో స్టార్ హీరోలేమి మిన‌హాయింపు కాదు. టైర్ వ‌న్ నుంచి టైర్ -3 వ‌ర‌కూ హీరోలంతా శూన్య జాబితాలో ఉన్నారు. మొన్న భారీ అంచ‌నా ల మ‌ధ్య రిలీజ్ అయిన 'గాండీవ‌ధారి అర్జున‌' డిజాస్ట‌ర్ అయింది. రిలీజ్ డే ..ఆ మ‌రుస‌టి ..వీకెండ్ చూసే స‌రిఇకి అర్జున సంగ‌తి తేలిపోయింది. రివ్యూలు నెగిటివ్ గా ఉన్నా..కొన్ని సినిమాలు వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో వ‌రుణ్ తేజ్ సినిమా పాస్ అవుతుంద‌ని చాలా మంది భావించారు.

కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ప‌న‌వ్వ‌లేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ తో మార్కెట్ లోకి వ‌చ్చిన 'భోళా శంక‌ర్' అభిమానులే విమర్శించేలా ఫ‌లితాలు సాధించింది. మెగా ఇమేజ్ నే డ్యామేజ్ చేసిన చిత్రంగా నిలిచింది. ఇక 'శాకుంత‌లం'..'ఏజెంట్'.. 'రావ‌ణ‌సుర‌'.. 'అమిగోస్'.. 'స్పై'..'రామ‌బాణం'.. 'క‌స్ట‌డీ' లాంటి సినిమా ఫ‌లితాలు తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన సినిమాలు ఊహించ‌ని ఫ‌లితాలు సాధించాయి.

'బ్రో'లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించినా ఆ సినిమాపై ప‌వ‌న్ ఇమేజ్ ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేదు. ఆ మాత్రం పాజిటివ్ టాక్ వ‌చ్చినందుకు బాక్సాఫీస్ వ‌ద్ద బ్రో ర‌ప్పాడించాలి. కానీ రెండు..మూడు రోజుల‌కే చ‌ల్ల‌ప‌డింది. ఇంకా ఇలా డివైడ్ టాక్ తో మరికొన్ని సినిమాలున్నాయి. వాటిని పూర్తిగా హిట్ అన‌లేం..ప్లాప్ అన‌లేని ప‌రిస్థితి. మొత్తంగా గ‌డిచిన ఎనిమిది నెల‌ల్లో చిన్న‌..పెద్ద సినిమాల ద్వారా ప‌రిశ్ర‌మ‌కి నాలుగు కోట్ల‌కు పైగానే న‌ష్టాలు అంచ‌నా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.

వీటిలో కొన్నింటికి కనీసం డిజిటల్, శాటిలైట్ బిజినెస్ కూడా జరగలేదు. ఇవేవి క‌నీసం కంటెంట్ ఉన్న చిత్రాలు కాక‌పోవ‌డంతో డిజ‌ట‌ల్ కంపెనీలు ముందుకు రాలేదు. రిస్క్ తీసుకుని కొన‌డం కంటే కామ్ గా ఉంటే బెట‌ర్ అని వాటి వైపు చూడేల‌దు. దీంతో వాటిని ఎలా బిజినెస్ చేయాలా? అని నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.