Begin typing your search above and press return to search.

పూజాహెగ్డే టాలీవుడ్ కి గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

పూజాహెగ్డే టాలీవుడ్ ని కాద‌ని బాలీవుడ్ కి వెళ్లిన మాట వాస్త‌వం. డేట్లు కేటాయించ‌లేనంటూ 'గుంటూరు కారం' ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 Sep 2023 6:30 AM GMT
పూజాహెగ్డే టాలీవుడ్ కి గుడ్ బై చెప్పిన‌ట్లేనా?
X

పూజాహెగ్డే టాలీవుడ్ ని కాద‌ని బాలీవుడ్ కి వెళ్లిన మాట వాస్త‌వం. డేట్లు కేటాయించ‌లేనంటూ 'గుంటూరు కారం' ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి అమ్మ‌డు మ‌ధ్య‌లో త‌ప్పుకుంది. అప్ప‌టికే సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆమె పార్టు చిత్రీక‌ర‌ణ మొద‌లు పెట్ట స‌మ‌యంలో ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయింది. అప్ప‌టికే అమ్మ‌డి చేతిలో ఓ హిందీ సినిమా ఉంది. ఆ సినిమా కోసం 'గుంటూరు కారం' వ‌దులుకుంది.

ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా అమ్మ‌డు నో చెప్పింద‌ని ప్ర‌చారం సాగింది. తాజాగా పూజ బ్యూటీ మ‌రో రెండు హిందీ సినిమాల‌కు ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న 'కోయి శ‌క్' అనే సినిమాలో ఈ బ్యూటీని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ సినిమా వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇదొక ఇన్వ‌స్టిగేటివ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ సినిమా.

ఇందులో పూజాహెగ్డే పాత్ర చాలా శ‌క్తి వంతంగా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. అలాగే ఈ సినిమాతో పాటు ఆయుష్మాన్ ఖురానా.. ర‌ణ‌వీర్ సింగ్ కొత్త ప్రాజెక్ట్ ల్లోనూ పూజ పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి. ఇలా అమ్మ‌డి లైన‌ప్ చూస్తే మ‌ళ్లీ టాలీవుడ్ కి రావ‌డం క‌ష్ట‌మ‌నే సంకేతాలు అందుతున్నాయి. పూజా కేవ‌లం బాలీవుడ్ కెరీర్ పైనే ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

అందుకే తెలుగు సినిమాలు కాద‌ని హిందీ సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. ఇక్క‌డ మ‌రో కార‌ణం కూడా తెర‌పైకి వ‌స్తుంది. తెలుగు పాత్ర‌లు..హిందీ పాత్ర‌ల వ్య‌త్యాసాన్ని కూడా అమ్మ‌డు తెర‌పైకి తెస్తోందిట‌. హిందీ పాత్ర‌ల‌కంటే తెలుగు పాత్ర‌ల‌కు శ‌క్తివంతంగా ఉండ‌టం లేద‌ని...కేవ‌లం కొంత మంది ద‌ర్శ‌కులు త‌ప్ప చాలా మంది గ్లామ‌ర్ వ‌ర‌కే ప‌రిమితం చేస్తున్నార‌ని.. అది కెరీర్ పైనా ప్ర‌భావం చూపిస్తుంద‌ని భావిస్తుందిట‌. టాలీవుడ్ నుంచి ఉన్న ప‌ళంగా బాలీవుడ్ కి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఇదీ ఒక‌టిగా లీకులందుతున్నాయి. ఇదే నిజ‌మైతే అమ్మ‌డు మ‌ళ్లీ టాలీవుడ్ వైపు రావ‌డం క‌ష్ట‌మే.