ఆ ఇద్దరికీ 'పుష్ప' స్పూర్తి అనొచ్చా?
కానీ తాను రాసుకున్న స్టోరీ స్పాన్ ఎక్కువ ఉండటం సహా చెప్పాల్సిన కథ మిగిలి ఉండటంతో రెండు భాగాలయింది
By: Tupaki Desk | 7 Oct 2023 5:58 AM GMT'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలని తొలుత దర్శకుడు సుకుమార్ అనుకోలేదు. సినిమా లెంగ్త్ ఎక్కువ అవ్వడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ ని క్లైమాక్స్ చేసి మొదటి భాగంగా రిలీజ్ చేసారు. పాన్ ఇండియా లో మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండవ భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. నిజానికి లెంగ్త్ ఎక్కువ అవ్వకుండా ఉంటే పుష్ప కేవలం ఒకచిత్రమే అయ్యేది. అక్కడితో పుష్ప కథ ముగిసేది.
కానీ తాను రాసుకున్న స్టోరీ స్పాన్ ఎక్కువ ఉండటం సహా చెప్పాల్సిన కథ మిగిలి ఉండటంతో రెండు భాగాలయింది. ఇప్పుడీ సినిమా మిగతా మేకర్స్ లోనూ కొత్త ఆలోచనలకు నాంది పలికిందా? అంటే అవుననే అనాలేమో. ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన సందర్భంలో రెండు భాగాలగా తీయాలని ఆయన అనుకోలేదు.
ఒక భాగంగానే దేవరని మొదలు పెట్టారు. కానీ స్టోరీ స్పాన్ ఉండటంతో ఇప్పుడు రెండు భాగాలైంది. అలాగే విజయ్ దేరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లోకూడా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు తాజాగా దర్శకుడు రివీల్ చేసారు. ఈ సినిమా కూడా సెట్స్ లో ఉంది. ఇలా దర్శకులు మొదటి భాగం రిలీజ్ కి ముందే రెండవ భాగాన్ని ప్రకటించడం వెనుక 'పుష్ప' స్ట్రాటజీతోనే ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
ఇలా ప్రకటించే ధైర్యం పుష్ప వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు. ఇంతవరకూ లేని కొత్త పోకడకి టాలీవుడ్ మేకర్స్ నాంది పలకడం విశేషం. అయితే రెండవ భాగం తెరకెక్కించాలా? లేదా? అన్నది మొదటి భాగం ఫలితం పై ఆధారపడి ఉంటుంది. తొలి భాగం సక్సెస్ అయితేనే రెండవ భాగాన్ని తెరకెక్కిస్తారు. లేదంట! అక్కడితో ఆ కథకి పుల్ స్టాప్ పెట్టక తప్పదు. కొరటాల ధైర్యంగా ప్రకటించినా గౌతమ్ తిన్ననూరి మాత్రం సందేహం వ్యక్తం చేసారు. రెండవ భాగం కథ సిద్దమైందని..తొలి భాగం రిలీజ్ తర్వాత రెండవ భాగంపై నిర్ణయం తీసుకుంటామని తెలివిగా నెగిటివ్ రాకుండా ముందే జాగ్రత్త పడ్డారు.