Begin typing your search above and press return to search.

మాస్ టైగర్ తో బాలయ్య సమరం.. బ్రేక్ చేయగలడా?

తెలుగు చిత్ర సీమలో ఓ సినిమా విజయంలో సెంటిమెంట్, ట్రాక్ రికార్డ్ కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసింది

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:30 PM GMT
మాస్ టైగర్ తో బాలయ్య సమరం.. బ్రేక్ చేయగలడా?
X

తెలుగు చిత్ర సీమలో ఓ సినిమా విజయంలో సెంటిమెంట్, ట్రాక్ రికార్డ్ కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసింది. కానీ ప్రతీసారి ఇదే వర్కౌట్ అవుతుందని చెప్పలేం. అయితే పండగ సీజన్​లో సాధారణంగా ఇద్దరు హీరోలు ఒకేసారి బరిలోకి దిగినప్పుడు ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుంది. అలా ఈ సారి దసరా బరిలో నందమూరి నటసింహం బాలయ్య - మాస్ మహారాజా రవితేజ పోటీ పడటం ఉత్కంఠతకు దారీ తీసింది.

ఈ దసరా పండగకు నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా.. భగవంత్ కేసరి వర్సెస్​ టైగర్ నాగేశ్వరరావు పోటీగానే ప్రేక్షకులు చూస్తున్నారు. వీరిద్దరు గతంలో పోటీపడ్డ ట్రాక్ రికార్డ్ వివరాలను బయటకు తీసి తిరగేస్తున్నారు.

2008 సంక్రాంతికి బాలయ్య ఒక్క మగాడుతో వచ్చి డీలా పడగా రవితేజ కృష్ణ చిత్రంతో వచ్చి భారీ హిట్​ను అందుకున్నారు. 2009లో బాలయ్య మిత్రుడుతో బోల్తా కొట్టగా.. రవితేజ కిక్​ కెరీర్​ బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. మూడో సారి 2011 సంక్రాంతికి పరమవీర చక్రతో పలకరించిన బాలయ్యకు నిరాశ ఎదురవ్వగా.. మిరపకాయతో వచ్చిన మాస్​ మాహారాజా బిగ్ సక్సెస్ అందుకున్నారు. అలా మూడు సార్లు రవితేజనే పైచేయి సాధించారు.

దీంతో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి సహజంగానే ఎక్కువగా ఉంది. అయితే ఈ సారి భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు రెండు సినిమాల ట్రైలర్స్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. రెండు చిత్రాల ట్రైలర్లు ప్రామిసింగ్​గా ఉండటంతో సినిమాలపై అంచనాలను పెంచేశాయి.

టైగర్ నాగేశ్వరరావు టెక్నికల్​గా స్కేల్​, విజన్ పరంగా హైస్టాండర్డ్స్​లో కనిపిస్తోంది. భగవంత్ కేసరి ఎమోషన్స్​, సెంటిమెంట్​, అదరిపోయే డైలాగ్​లతో పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్​టైనర్​గా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఈ సారి రెండు చిత్రాలు మంచి హిట్ అందుకుంటాయని అనిపిస్తోంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం భగవంత్ కేసరియే ఈ సారిపై చేయి సాధిస్తుందని, గత మూడు సార్ల ఓటమికి బాలయ్య రివెంజ్ తీర్చుకుంటారని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...