సంక్రాంతి బాక్సాఫీస్.. ఆ ఒక్క చిత్రానికే థియేటర్లు డౌట్!
వచ్చే సంక్రాంతి 2024 బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా సాగనుందన్న సంగతి తెలిసిందే. ఏకంగా అరడజను సినిమాలు బరిలోకి దిగుతున్నాయి
By: Tupaki Desk | 20 Oct 2023 10:57 AM GMTవచ్చే సంక్రాంతి 2024 బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా సాగనుందన్న సంగతి తెలిసిందే. ఏకంగా అరడజను సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. పైగా అందులో దాదాపు ఐదు చిత్రాలు స్టార్ హీరోలవే కావడం విశేషం. దీంతో ఈ చిత్రాలన్నింటికీ థియేటర్లను ఎలా సర్దుబాటు చేస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా వీటిలో ఓ చిత్రం థియేటర్ల సమస్యను ఎక్కువగా ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది.
మహేశ్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా, యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ వచ్చే ముగ్గుల పండక్కు బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రం కూడా ఈ పతాకాల పండక్కే విడుదల తేదీని కన్ఫామ్ చేసుకున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చింది.
అయితే ఈ చిత్రాల్లో మహేశ్ గుంటూరు కారం అన్నింటికన్నా పెద్ద సినిమా. అలానే బాగా బజ్ ఉన్న చిత్రం కూడా. ఆ తర్వాత సైంధవ్, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు కూడా మంచి అడ్వాంటేజ్, హైప్ ఉన్న చిత్రాలే. వీటికి సురేశ్ బాబు, దిల్ రాజు నిర్మాతలు కావడం వల్ల.. థియేటర్ల సమస్య పెద్దగా ఉండదు.
ఇక రవితేజ ఈగల్ మొదట్లో సంక్రాంతికి రానున్నట్లు స్పష్టత ఇచ్చినప్పటికీ.. మరోసారి ఏమీ క్లారటీ ఇవ్వలేదు. దీనిపై కాస్త డౌట్‌గా ఉంది. ఒకవేళ ఇది పండగ బరిలో దిగినట్టైతే.. ఇక కొత్త చిత్రాలేమీ సంక్రాంతి బెర్త్‌ను ఖరారు చేసుకోవడానికి అవకాశం ఉండదు. నాగార్జున నా సామి రంగ చిత్రం.. పండక్కి రావాలా వద్దా అనేది దాని షూటింగ్‌పై ఆధారపడి ఉంటుంది. అయినా నాగ్‌కు ఈ పండగ సెంటిమెంట్ కాబట్టి.. దాదాపుగా అప్పుడే వచ్చి పైసా వసూల్ చేయాలని పట్టుదలతో ఉన్నారు.
ఫైనల్‌గా మిగిలింది 'హనుమాన్' చిత్రం. మరి స్టార్ హీరోల విపరీతమైన పోటీ మధ్య ఈ సినిమా థియేటర్లను పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. స్క్రీన్లను దక్కించుకోవడమంటే పెద్ద సవాల్ అనే చెప్పాలి. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఏమైనా మార్చుకుంటుందా లేదా అనేది..