పాత హీరోయిన్లు పూర్తిగా పాతబడిపోయినట్లేనా!
తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావడం సంతోషంకరమైన విషయం. 'బేబి' సినిమాతో వైష్ణవి చైతన్య బాగానే ఫేమస్ అయింది
By: Tupaki Desk | 31 Oct 2023 4:30 PM GMTతెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావడం సంతోషంకరమైన విషయం. 'బేబి' సినిమాతో వైష్ణవి చైతన్య బాగానే ఫేమస్ అయింది. తొలి సినిమా అమ్మడికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ విజయం కొత్త అవకాశాలకు మంచి మార్గాన్ని వేసింది. వైష్ణవి ఇలా దూసుకురావడంతో ఇండస్ట్రీకి రావాలనుకునే కొత్త అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా దేత్తడి అలేఖ్య హారిక కూడా సాయిరాజేష్ తదుపరి ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన హారిక సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకతని క్రియేట్ చేసు కుంది. అటుపై బిగ్ బాస్ లో ప్రవేశించడం అమ్మడి కెరీర్ దోహద పడింది. ఆ అంశాలే అమ్మడని టాలీవుడ్ కి హీరోయిన్ గా ప్రమోట్ చేసాయి. సినిమా విజయంసాధిస్తే హారికి మంచి భవిష్యత్ ఉంటుందని ఫిలిం సర్కిల్స్ లో అప్పుడే గుసగుస వినిపిస్తుంది. ఇలా తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లగా ఛాన్సులు రావడం అన్నది 2023లోనే హైలైట్ అవుతుంది.
అంతకు ముందు కొంత మంది తెలుగు అమ్మాయిలు నటించారు. కానీ ఇంతగా వైరల్ కాలేదు. మరి ఇప్పటికే లాంచ్ అయిన హీరోయిన్ల పరిస్థితి ఏంటి? ఈషారెబ్బా.. డింపుల్ హయతి..ప్రియాంక జవాల్కర్..చాందిని చౌదరి లాంటి భామలకి తెలుగులో అవకాశాలు వస్తున్నాయా? అంటే ఏదో వస్తున్నాయంటే? వస్తున్నాయి అనుకోవాలి. తప్ప వాళ్ల పేర్లు పెద్దగా వినిపించడంలేదు.
డింపుల్ లాంటి భామకి మంచి అవకాశాలు వచ్చినా...ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెబుతున్నాయి. ఈషారెబ్బా కి హీరోయిన్ గా చేయాలని ఆసక్తి ఉన్నా..అవకాశాలు రావడంలేదు. స్టార్ హీరోల చిత్రాల్లో ఏదో పాత్రకి పరిమితమవ్వడం తప్ప తాను అనుకున్నది రీచ్ అవ్వడం లేదు. ఇక మిగతా భామల పేర్లు అయితే ఎక్కడా వినిపిచలేదు కూడా. దీంతో వీళ్లంతా ఓల్డ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతున్నట్లు కనిపిస్తుంది.
పరిశ్రమ కొత్త భామలకిచ్చినంత ప్రాధాన్యత వీళ్లకి ఇస్తున్నట్లు కనిపించలేదు. అంజలి..ఆనంది లాంటి వాళ్లు కోలీవుడ్ లో బిజీ అయ్యారు. వాళ్లు ఇక్కడ సినిమాలు చేయకపోయినా చెల్లిపోతుంది. కానీ కాస్తా కూస్తో ఫేమస్ అయిన భామలకి అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యకరం.