Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: నార్త్ లో మనోళ్ళ లెక్క పెరుగుతోంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి ఎలాంటి ఆదరణ లభించిందో అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   18 April 2024 5:08 AM GMT
బాక్సాఫీస్: నార్త్ లో మనోళ్ళ లెక్క పెరుగుతోంది
X

టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ ఏడాదిలోనే అరడజను పాన్ ఇండియా సినిమాల వరకు తెలుగు నుంచి రాబోతున్నాయి. ఈ చిత్రాలన్నీ భారీ అంచనాల మధ్యనే రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటం విశేషం. గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే తెలుగు స్టార్ హీరోల చిత్రాలకి నార్త్ ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ లో దమ్ముంటే నార్త్ ఆడియన్స్ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి ఎలాంటి ఆదరణ లభించిందో అందరికి తెలిసిందే. అలాగే స్టార్ క్యాస్టింగ్ లేని హనుమాన్ సినిమాని కూడా నార్త్ లో అద్భుతంగా ఆదరించారు. ఈ కారణంగానే నార్త్ ఇండియా డిస్టిబ్యూటర్స్ తెలుగు సినిమాలకి సంబందించిన నార్త్ ఇండియా రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. బాలీవుడ్ స్టార్ డిస్టిబ్యూటర్స్ అనిల్ తడాని తెలుగు స్టార్స్ చిత్రాలలకి సంబందించిన నార్త్ ఇండియా రైట్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

వీటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా నార్త్ ఇండియా రైట్స్ ని అనిల్ తడాని ఏకంగా 200 కోట్లకి అడ్వాన్స్ బేసిస్ మీద సొంతం చేసుకున్నారంట. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై నార్త్ ఇండియాలో అత్యధిక ధర పలికిన తెలుగు సినిమాగా పుష్ప ది రూల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898ఏడీ నార్త్ ఇండియా రైట్స్ ని 100 కోట్లకి అనిల్ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ రైట్స్ ని 50 కోట్లకి అనిల్ తడాని, కరణ్ జోహార్ కలిపి కొన్నారు. ఈ సినిమాపై కూడా హిందీ బెల్ట్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మూవీలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ నటిస్తూ ఉండటంతో కచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని భావిస్తున్నారు. హిందీ నటులు లేకపోయిన కూడా అత్యధిక ధర పలికిన మూవీ అంటే పుష్ప ది రూల్ మాత్రమే.

దీనికి కారణం పుష్ప పార్ట్ 1 కి హిందీలో వచ్చిన ఆదరణ అని తెలుస్తోంది. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని హిందీ బెల్ట్ లో కలెక్ట్ చేసింది. ఈ కారణంగానే పుష్ప ది రూల్ సినిమా కోసం అనిల్ తడాని పెద్ద మొత్తంలో ఆఫర్ చేశారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలు బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి. డిస్టిబ్యూటర్స్ కి ఎలాంటి లాభాలు తీసుకొస్తాయి అనేది వేచి చూడాలి.