ఆగస్టును వదిలేసిన 3 సినిమాలు
అయితే రిలీజ్ సమయం దగ్గరైన కొద్ది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాకపోవడమో లేదంటే షూటింగ్ ఫినిష్ కాకపోవడం వలన వాయిదా పడుతూ ఉంటాయి
By: Tupaki Desk | 5 Aug 2023 10:04 AM GMTకొన్ని సినిమాలు రిలీజ్ డేట్ ముందే ప్రకటిస్తారు. అయితే రిలీజ్ సమయం దగ్గరైన కొద్ది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాకపోవడమో లేదంటే షూటింగ్ ఫినిష్ కాకపోవడం వలన వాయిదా పడుతూ ఉంటాయి. ఇలా చాలా సినిమాలు అనుకున్న డేట్ కంటే ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకి వస్తాయి. ఆగష్టులో రిలీజ్ కావాల్సిన మూడు సినిమాలు అలా వాయిదా పడ్డాయి. మినిమమ్ రేంజ్ సినిమాలు అయిన కూడా వీటిపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.
వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ ఆగష్టులోనే రిలీజ్ కావాల్సి ఉంది. ఆగష్టు 18న ప్రేక్షకుల ముందుకి వస్తుందని ఖరారు చేశారు. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగలేదనే కారణం చూపించి వాయిదా వేశారు. ఎప్పుడు రిలీజ్ అనేది ఖరారు చేయలేదు. నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శాకత్వంలో తెరకెక్కిన ఆదికేశవ మూవీ ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ఇంకా రెండు వారాలు ఉందనగా పోస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ లో ఈ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ కెరియర్ లో నాలుగో చిత్రంగా ఈ మూవీ రాబోతోంది.
శ్రీకాంత్ అడ్డాల అంటే క్లాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలు కనిపిస్తాయి. కొత్తబంగారులోకం సినిమా నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా కుటుంబ బంధాల నేపథ్యంలోనే ఉంటాయి. అయితే ఊహించని విధంగా తన స్టైల్ పూర్తిగా మార్చేసి పెద్దకాపు అనే మూవీ చేశారు. దీనిని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. పెద్దకాపు పార్ట్ 1 ఆగష్టు 18న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. టీజర్ కూడా రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు.
అయితే ఇప్పుడు ఈ చిత్రం కూడా వాయిదా పడింది. నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇలా ఒకే రోజు రిలీజ్ కావాల్సిన మూడు చిత్రాలు కూడా వాయిదా పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.